Fact Check: వ్యాపారి భార్యపై గ్యాంగ్ రేప్ జరిగిందా? అది లవర్ అప్పు తీర్చుకోవడానికి ఆమె వేసిన స్కెచ్
వ్యాపారి భార్యపై గ్యాంగ్ రేప్ ఘటన అవాస్తవమని పోలీసులు తేల్చారు. ఆమె లవర్ అప్పులు తీర్చుకోవడానికి వారు దొంగతనం స్కెచ్ వేశారని, ఆమెపై గ్యాంగ్ రేప్ జరగనేలేదనీ పోలీసులు దర్యాప్తులో తేలింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ బిజినెస్‌మ్యాన్ ఇంట్లో చోరీ జరిగిందని, ఆరుగురు దొంగలు ఇంటిలోకి చొరబడి విలువైన వస్తువులు, రూ. 10 లక్షలు దొంగతనం చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారు దొంగతనంతో సరిపెట్టకుండా ఆ వ్యాపారి భార్యపై గ్యాంగ్ రేప్ చేశారని, సిగరెట్ మొనలతో కాల్చి చిత్రహింసలు పెట్టారనీ ఆ కథనాలు పేర్కొన్నాయి. బిజినెస్ మ్యాన్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు దర్యాప్తులో విస్తూపోయే నిజాలు వెలుగుచూశాయి. అసలు దోపిడీ కాదని, బిజినెస్ మ్యాన్ భార్య, ఆమె లవర్ కలిసి వేసిన స్కెచ్ అయిన తెలియవచ్చింది. ఈ డబ్బుతో ఆమె లవర్ అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కెచ్ వేసినట్టు బయటపడింది.
32 ఏళ్ల నిందితుడు పుష్పేంద్ర చౌదరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బిజ్నోర్ ఎస్పీ నీరజ్ కుమార్ జదౌన్ మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆమెపై ఓ కన్నేసే ఉంచారని వివరించారు. ఆమె తన స్టేట్‌మెంట్‌లో ఆరుగురు వ్యక్తులు సాయంత్రం ఏడు గంటల కాలంలో ఇంట్లోకి చొరబడినట్టు ఆమె చెప్పారు. సాయంత్రం పూట అక్కడ రద్దీ ఎక్కువగా వుంటుంది. ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి, గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమే. వీటికితోడు ఆ సమయంలో కుటుంబంలోని అందరూ ఇంట్లో ఉండరనే విషయం దొంగలకు తెలుసు అని తమకు తెలుసు అని వివరించారు.
ఆ బిజినెస్ మ్యాన్ భార్య, ఆమె లవర్ అప్పుడు ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారని తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆమె చర్మంపై కాలిన గుర్తులు వారిద్దరూ కలిసి చేసుకున్నవేనని దర్యాప్తులో తేలిందని వివరించారు. ఆ తర్వాత చేసిన గ్యాంగ్ రేప్ ఆరోపణలనూ పరిశీలించడానికి ఆమెను హాస్పిటల్‌లో పరీక్షల కోసం పంపించామని,అసలు ఆమె ప్రైవేట్ పార్టులో ఏ గాయం లేదని తేలిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆమె భోరున ఏడుస్తూ నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు.