Alok Sharma : స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కొత్త చీఫ్ గా ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అలోక్ శర్మ నియామకం అయ్యారు. ఆయన 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పదవి కాలం ఎప్పటి వరకు ఉంటుందో ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

New SPG Chief Alok Sharma : ప్రధానికి సాయుధ భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కొత్త చీఫ్ గా ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అలోక్ శర్మ నియమితులయ్యారు. ప్రతిష్టాత్మక ఎస్పీజీకి చీఫ్ గా ఎంపికైన అలోక్ శర్మ 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఎస్పీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 

తెలంగాణ ఎన్నికలు : అసలు పేరు ఒకటి, వాడుకలో మరొకటి.. అభ్యర్థుల నామినేషన్లలో విచిత్రాలు...

అలోక్ శర్మ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎస్పీజీ డైరెక్టర్ గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా సెప్టెంబర్ 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. 

Scroll to load tweet…

అరుణ్ కుమార్ సిన్హా 1987 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన వయసు 61 ఏళ్లు. కాగా.. అలోక్ శర్మ పదవీకాలం ఇంకా ఖరారు కాలేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని సిబ్బంది మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.