రెస్టారెంట్ లో పేలిన గ్యాస్ సిలిండర్.. చెలరేగిన మంటలు.. 44 మంది మృతి
రెస్టారెంట్ లోని కిచెన్ లో సిలిండర్ పేలింది. దీంతో ఆ రెస్టారెంట్ ఉన్న ఏడు అంతస్తుల బిల్డింగ్ లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 44 మంది మరణించారు. (Massive fire breaks out in Bangladesh 44 dead) చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఆ రెస్టారెంట్ ఉన్న బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న 44 మంది మరణించారు. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరెంతో మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది.
Supreme Court: "ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు"
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా బెయిలీలో ఏడు అంతస్తుల గ్రీన్ కాసీ కాటేజ్ అనే వాణిజ్య భవనం ఉంది. అందులోని మొదటి అంతస్తులో కచ్చి భాయ్ అనే రెస్టారెంట్ ఉంది. ఎప్పటిలాగే గురువారం రాత్రి కస్టమర్ లతో హడావిడిగా ఉంది. అయితే 9.45 గంటల సమయంలో ఆ రెస్టారెంట్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాయాల్లోనే ఆ మంటల పై అంతస్తులకు వ్యాపించాయి.
బీజేపీ సీఈసీ కీలక భేటీ.. ఎన్నికల షెడ్యూల్ కు ముందే అభ్యర్థులపై ప్రకటన
దీనిపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ వైపు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే, అందులో చిక్కుకున్న దాదాపు 70 మందిని రక్షించారు. అయితే అప్పటికే 42 మంది తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారందరినీ స్థానికంగా ఉన్న పలు హాస్పిటల్స్ కు తరలించారు.
కోటి ఇళ్లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్: రూ. 75 వేల కోట్లు
కాగా.. ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 33 మంది, షేక్ హసీనా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో మరో 10 మంది, సెంట్రల్ పోలీస్ హాస్పిటల్ లో మరో మరణం సంభవించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 44 కు చేరుకుందని స్థానిక పోలీసులు వెల్లడించారు. పలువురికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భారీ మంటలు అదుపులోకి వచ్చాయి.