Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ సీఈసీ కీలక భేటీ.. ఎన్నికల షెడ్యూల్ కు ముందే అభ్యర్థులపై ప్రకటన

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం జరిగింది. ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించకముందే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తోంది.

PM Modi chairs key BJP meeting to pick candidates for Lok Sabha polls KRJ
Author
First Published Mar 1, 2024, 7:13 AM IST

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలువాలనే టార్గెట్ తో కమలం పార్టీ సార్వత్రిక సమరానికి సమాయత్తమవుతోంది. మరోవైపు..  ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విస్రుత్తంగా పర్యటిస్తూ.. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో చేస్తు బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అయింది.  

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సీఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు హాజరయ్యారు.సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్డావిస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. .

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించకముందే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తోంది.  ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను విడుదల చేయడానికి ముందే ఉత్తరప్రదేశ్‌లోని పలు స్థానాల్లో బిజెపి తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది . గత వారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జెపి నడ్డా , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా బిజెపి అగ్ర నాయకులు ఎన్నికల వేళ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై  చర్చించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios