సైనిక దాడిని విస్తృతం చేసిన ఇజ్రాయెల్.. గాజాలో 8 వేలకు చేరిన మరణాలు..

హమాస్ దళాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడిని విస్తృతం చేసింది. హమాస్ పై పోరు ఆదివారం నుంచి రెండో దశలోకి ప్రవేశించాయని ఇజ్రాయెల ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Israel widened the military attack.. Deaths reached 8 thousand in Gaza..ISR

israel hamas war : ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయిల్ సైనికులు, హమాస్ దళాలకు మధ్య భీకర పోరు జరుగుతోంది. దీంతో ఇరు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ పోరు ఆదివారం నాటికి రెండో దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దీంతో ఐడీఎఫ్ దళాలు తమ దాడిని విస్తృతం చేశాయి.

ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా అస్వస్థత.. వాంతులు, విరేచనాలతో అవస్తలు పడ్డ భక్తులు..

ఇజ్రాయెల్ భీకర పోరు సాగిస్తుండటంతో గాజాలో 8,000 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. అదే సమయంలో ఇజ్రాయెల్ వైపు 1,400 మందికి పైగా మరణించారు. అయితే ఇందులో ప్రధానంగా అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన దాడిలో ఎక్కవ మరణాలు సంభవించాయి.

ట్రాక్టర్ విన్యాసాల పోటీల్లో విషాదం.. ఇంజిన్ కింద పడి స్టంట్ మ్యాన్ దుర్మరణం.. వీడియో వైరల్

కాగా.. ఆదివారం 33 ట్రక్కులు నీరు, ఆహారం, మందులతో ఈజిప్టు నుంచి ఏకైక సరిహద్దు క్రాసింగ్ లోకి ప్రవేశించాయని రఫా క్రాసింగ్ అధికార ప్రతినిధి వాయెల్ అబో ఒమర్ అసోసియేటెడ్ ప్రెస్ కు తెలిపారు. రఫా క్రాసింగ్ ను సందర్శించిన అనంతరం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. పౌరుల బాధలు తీవ్రంగా ఉన్నాయని, గాజాలోకి తాను ప్రవేశించలేకపోయానని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా అధికారుల చర్యలపై 2014 నుంచి విచారణ జరుపుతున్న కరీంఖాన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఇజ్రాయెల్ కు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. హమాస్ అక్టోబర్ 7 దాడిని అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. తుపాకీ, క్షిపణి లేదా రాకెట్ లక్ష్యంగా పెట్టుకున్నవారిపై భారం పడుతుందని ఆయన అన్నారు.

విజయనగరం రైలు ప్రమాదంపై ఖర్గే దిగ్భ్రాంతి.. కేంద్రంపై ఫైర్.. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు విజ్ఞప్తి

ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో హమాస్ కమాండ్ సెంటర్లు, యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగ స్థావరాలతో సహా 450కి పైగా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. గాజాపై భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. చాలా మంది గాజా నివాసితులు ముట్టడి భూభాగంలోని దక్షిణ భాగానికి పారిపోవాలన్న తమ ఆదేశాలను పట్టించుకోలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios