Asianet News TeluguAsianet News Telugu

Himachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. 27ఇండ్లు దగ్ధం

Himachal Pradesh: ఈశాన్య  భార‌త రాష్ట్రమైన  హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం  చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్‌ గ్రామంలో ఆదివారం తెల్ల‌వారు జామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్క పక్కనే ఉన్న 26 ఇండ్లతోపాటు 2 దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు మంటలు వ్యాపించాయి.
 

27 houses gutted in fire in Himachal Pradesh's Majhan
Author
Hyderabad, First Published Dec 12, 2021, 3:14 PM IST

Himachal Pradesh:  ఈశాన్య  భార‌త రాష్ట్రమైన  హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం  చోటుచేసుకుంది.  ఈ ప్ర‌మాదంలో మొత్తం 27 ఇండ్లు కాలిబుడిదయ్యాయి. అలాగే, మ‌రో రెండు దేవాల‌య‌యాలు, 26 ప‌శువుల కొట్టాలకు మంట‌లు వ్యాపించాయి. ఆదివారం తెల్ల‌వారు జామున చోటుచేసుకున్న ఈ అగ్నిప్ర‌మాద మంట‌ల‌ను ఆర్ప‌డానికి అగ్నిమాప‌క సిబ్బంది మూడు గంట‌ల పాటు శ్ర‌మించారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. హిమాచ‌ల్‌లోని కులు జిల్లా గ‌డ‌ప‌ర్లి పంచాయ‌తీలోని మారుమూల గ్రామ‌మైన మ‌జ్‌హ‌న్ లో ఆదివారం తెల్ల‌వారు జామున ప్ర‌మాదవ‌శాత్తు ఓ ఇంటిలో మంట‌లు అంటుకున్నాయి. ఆ తర్వాత మిగతా ఇళ్లకు వ్యాపించాయి. దీంతో గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టేసే విధంగా తీవ్రరూపంలో వ్యాపించ‌సాగాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  ఈ గ్రామంలోని చాలా ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ‌గా కలపను వాడ‌టంతో మంట‌లు వేగంగా వ్యాపించాయి. 

Also Read: Afghanistan hunger crisis: ఆక‌లి కేక‌ల ఆఫ్ఘాన్..


స‌మాచారం అందున్న అధికారులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు అక్క‌డికి రోడ్డు మార్గాలు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో.. అక్క‌డి చేరుకోవ‌డానికి దాదాపు మూడు గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది.  అప్ప‌టికే దాదాపు 20కిపైగా ఇళ్లు కాలిపోయిన‌ట్టు స‌మాచారం అందింద‌ని  డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. "గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లార్జీలోని అగ్నిమాపక సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి, అయితే అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఎలాంటి ప్రాణనష్టం జ‌రిగిన‌ట్టు స‌మాచారం ఇంకా లేదు’’ అని ఆయన చెప్పారు.  ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి ఖ‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌రాలేదు. కానీ షాట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు వ్యాపించి వుండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.  మంట‌ల‌ను ఆర్ప‌డానికి దాదాపు మూడు గంట‌లు అగ్నిమాప‌క సిబ్బంది శ్ర‌మించార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.9కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Also Read: Nadendla Manohar: తెలంగాణ ఎంపీల లాగా ఎందుకు చేయట్లేదు? : నాదేండ్ల మనోహర్
కాగా,  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్ర‌మాదంపై  స్పందించిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి  జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలావుండ‌గా, ప్ర‌తియేడాది శీతాకాలంలో ఈ ప్రాంతంలో అగ్నిప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లు స‌రిగ్గా లేని కార‌ణంగా ఇలాంటి ప్ర‌మాదాలు చోటుచేసుకున్న‌ప్పుడు అగ్నిమాప‌క సిబ్బంది రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంది. దీంతో న‌ష్టం అధికంగా ఉంటున్న‌ది. గడపర్లి పంచాయతీ పరిధిలోని మెయిల్, మ‌జ్‌హాన్‌, శక్తి, మారోర్, షుగడ్, బనౌగి, బ్రెత, షిర్యాడి, బదాని, బగిషైది గ్రామాలకు స‌రైన రోడ్లు లేని కార‌ణంగా గ‌ర్బ‌ణీల‌తో పాటు అనారోగ్యానికి గురైన వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించాడానికి మెయిన్ రోడ్ వ‌ర‌కు మంచాలే వారికి దిక్కు. ఈ ప్రాంతంలోని చాలా గ్రామాలకు ఇప్పుడు కూడా విద్యుత్‌, టెలికామ్ సేవ‌లు అందుబాటులో లేవంటే అక్క‌డి ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. 

Also Read: Karnataka: బంగారు నెక్లెస్‌ని మింగిన ఆవు.. ఏం చేశారంటే..

Follow Us:
Download App:
  • android
  • ios