Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాలో మళ్లీ హిందూ దేవాలయం ధ్వంసం.. గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసిన దుండగులు..

ఆస్ట్రేలియాలో మరో హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆ గోడలపై ఖలిస్థానీ అనుకూల నినాదాలు రాశారు. అలాగే భారత వ్యతిరేక నినాాదాలు రాశారు. 

Hindu temple destroyed again in Australia.. Thugs wrote anti-India slogans on the walls..
Author
First Published Jan 23, 2023, 9:17 AM IST

ఆస్ట్రేలియాలో మరో హిందూ దేవాలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఆ గోడలపై భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై ద్వేషపూరిత నినాదాలు రాశారు. గడిచిన రెండు వారాల్లో ఈ దేశంలో హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరగడం ఇది మూడో సారి.  ‘‘హిందుస్థాన్ ముర్దాబాద్’’, ‘‘ఖలిస్థాన్ జిందాబాద్’’ వంటి భారతదేశ వ్యతిరేక నినాదాలతో ఆలయ గోడలపై లిఖించారు. ఈ ఆలయం మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లో ఉంది.

కదులుతున్న రైలులో.. మహిళపై టికెట్ కలెక్టర్ మరో వ్యక్తితో కలిసి సామూహికఅత్యాచారం..

ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు 20,000 మందికి పైగా హిందువులు, సిక్కులను చంపడానికి కారణమైన ఉగ్రవాది భింద్రావాలాపై ప్రశంసలు కురిపించారు. ఆయనను ‘అమరవీరుడు’గా అభివర్ణించారు. గతంలో జరిగిన సంఘటనల్లోనూ ఇదే తరహా నినాదాలు ఆలయ గోడలపై రాశారు.

కాగా.. అంతకు ముందు కారమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు దేవాలయం, మిల్ పార్క్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిరం గోడలపై కూడా హిందువులు, భారతదేశానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత సందేశాలు అస్పష్టంగా రాశారు. హిందూ దేవాలయాలపై వరుస దాడులు అక్కడి హిందువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

బీహార్‌లో దారుణం...60 ఏళ్ల టీచర్ పై మహిళా కానిస్టేబుళ్ల లాఠీఛార్జ్..

భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మెల్‌బోర్న్‌లోని రెండు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆస్ట్రేలియా గర్వించదగిన, బహుళ సాంస్కృతిక దేశం అని తెలిపారు. వ్యక్తీకరణ స్వేచ్ఛకు తమ బలమైన మద్దతులో ద్వేషపూరిత ప్రసంగం, హింస లేదని ఆయన నొక్కి చెప్పారు. 

ఈ విషయంపై భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు చర్చించుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ‘‘మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము’’ అని ఆయన అన్నారు. మెల్బోర్న్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ స్థానిక పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు బెంగాల్ లో సీఏఏ, ఎన్ఆర్సీల‌కు బీజేపీ ప్ర‌చారం.. !

జనవరి 11న ఆస్ట్రేలియాలోని మిల్ పార్క్‌లోని బీఏపీఎస్ సంస్థా మందిర్‌పై భారతదేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు.  గోడలపై "హిందూస్థాన్ ముర్దాబాద్", "మోడీ హిట్లర్"  అంటూ పేర్కొన్నారు. కారమ్ డౌన్స్‌లోని రెండో హిందూ దేవాలయం, శ్రీ శివ విష్ణు మందిరం జనవరి 15-16 మధ్య రాత్రి సమయంలో మధ్య దాడి జరిగింది. ఈ ఘటన 17వ తేదీన వెలుగులోకి వచ్చింది. 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios