Asianet News TeluguAsianet News Telugu

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు బెంగాల్ లో సీఏఏ, ఎన్ఆర్సీల‌కు బీజేపీ ప్ర‌చారం.. !

Kolkata: లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు సీఏఏ, ఎన్నార్సీల‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. టీఎంసీ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని బీజేపీ నిర్ణయించిందని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సువేందు అధికారి తెలిపారు. 
 

Kolkata : BJP campaign for CAA and NRC in Bengal before Lok Sabha elections
Author
First Published Jan 23, 2023, 2:58 AM IST

Bengal BJP senior leader Suvendu Adhikari: ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నాయ‌క‌త్వంలోని బెంగాల్ తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) మ‌రో పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఆ పార్టీ త్వరలో వీధుల్లోకి రాబోతోంది. టీఎంసీ ప్రభుత్వ అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను ఏకం చేసేందుకు కాషాయ పార్టీ  ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంది. దుర్గాపూర్‌లో జరిగిన రెండు రోజుల పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు సీఏఏ, ఎన్నార్సీల‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. టీఎంసీ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు సువేందు అధికారి తెలిపారు. 

టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం

అవినీతిలో కూరుకుపోయిన ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ  నాయ‌క‌త్వంలోని టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని దుర్గాపూర్ సమావేశంలో బీజేపీ నిర్ణయించిందని సువేందు అధికారి మీడియాకు తెలిపారు. ఎక్కువ మంది టీఎంసీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయ‌న‌.. ఇప్పుడు టీఎంసీ నేతలను అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు అరెస్టు చేస్తున్నాయని అన్నారు. అవినీతి ప్ర‌భుత్వంపై పోరు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ఏకం చేస్తామ‌ని తెలిపారు. 

సీఏఏ-ఎన్నార్సీల‌పై ప్రచారం.. 

సీఏఏ, ఎన్ఆర్సీలపై కౌంటర్ క్యాంపెయిన్ చేపట్టాలని ఈ సమావేశంలో బీజేపీ నిర్ణయించింది. 2024 లోక్ స‌భ‌ ఎన్నికల్లో ఈ రెండు అంశాలపై టీఎంసీ చేస్తున్న ప్రచారాన్ని బట్టబయలు చేస్తామని సువేందు అధికారి అన్నారు. కుంభకోణాల్లో తమ ముఖ్య కార్యకర్తల ప్రమేయంతో తప్పించుకోవడం టీఎంసీ నేతలకు ఇప్పుడు కష్టంగా మారిందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు కూడా విమర్శిస్తున్నారని సువేందు అధికారి అన్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వ తీరును వివ‌రిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తార‌ని తెలిపారు. 

లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో 25 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటాం.. 

రిక్రూట్మెంట్ అవకతవకలు లేదా భారీ వలసలు కావచ్చు.. ఇలా ప్రతి అంశంలో టీఎంసీ ప్రభుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్యతిరేకత ఉందని సువేందు అధికారి అన్నారు. 2024 లోక్ స‌భ‌ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని 42 లోక్ స‌భ సీట్లలో 25 కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంద‌ని తెలిపారు. టీఎంసీ టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు బూత్ స్థాయిలో సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీఎంసీ కార్యకర్తలు కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఓటు వేసే అవకాశం కల్పిస్తే మమతా బెనర్జీ పార్టీ పతనానికి నాంది అవుతుందన్నారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం..

"రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కోసం పోలీసులు పనిచేస్తున్నారు. రాష్ట్రం చెబుతున్న మాటలను ఎన్నికల సంఘం అనుసరిస్తోందని సువేందు ఆరోపించారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కూడా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  'గత 20 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో లవ్ జిహాద్ లాంటివి జరుగుతున్నాయి. పిల్లలు గాయపడ్డారు, బాంబులు స్వాధీనం చేసుకున్నారు, స్త్రీలు హింసించబడ్డారు.. ప్రభుత్వ కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి కేంద్రాన్ని టార్గెట్ చేయడం ముఖ్యమంత్రికి, హోంమంత్రికి సొంత పోలీసులపై నమ్మకం లేదని నిరూపిస్తోంది' అని సువేందు అధికారి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios