కరుగుతున్న మంచు... నిద్రలేస్తున్న వేల ఏళ్ల నాటి వైరస్‌లు: కరోనా కంటే భయంకరమైనవా..?
రాబోయే రోజుల్లో కరోనా కంటే భయంకరమైన వ్యాధి మరొకటి రాబోతోందన్నది ఆ వార్తల సారాంశం. వివరాల్లోకి వెళితే.. ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన విపత్తు భూతాపం. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తుండటంతో భూతాపం పెరిగిపోతోంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.
ఇలాంటి పరిస్ధితుల్లో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా కంటే భయంకరమైన వ్యాధి మరొకటి రాబోతోందన్నది ఆ వార్తల సారాంశం. వివరాల్లోకి వెళితే.. ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన విపత్తు భూతాపం. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తుండటంతో భూతాపం పెరిగిపోతోంది.
Also Read:మహిళల తప్పుల వల్లే కరోనా విజృంభణ: మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రతి ఏటా ప్రపంచదేశాలు భూతాపాన్ని తగ్గించేందుకు సమావేశాలు జరిపాయే తప్పా.. తీసుకున్న చర్యలు చాలా తక్కువే. దీని కారణంగానే మరో భయంకర వ్యాధి రావడానికి కారణమవుతోంది.
2016 వేసవిలో ఐరోపా ఖండాన్ని ఓ హీట్ వేవ్ ఢీకొట్టింది. దీని దెబ్బకు ఉత్తరాన ఆర్కిటిక్‌లో భాగమైన సైబీరియాలో గడ్డకట్టిన మంచు కాస్తా కరిగిపోయింది. దీంతో కొన్నేళ్లుగా అక్కడ మంచులో గడ్డకట్టి ఉన్న బ్యాక్టీరియా ప్రానం పోసుకుంది.
దీని కారణంగానే ఆంత్రాక్స్ వ్యాపించింది. 1941లో ఓ రెయిన్ డీర్ చనిపోయి దాని కళేబరం మంచులో కూరుకుపోయింది. అయితే భూతాపం పెరగడంతో మంచు కరిగి డీర్ మృతదేహం బయటపడింది.
దీనిలో ఉన్న ఆంత్రాక్స్ బ్యాక్టీరియా అక్కడికి చుట్టుపక్కల నీటిపై పొరలో విస్తరించింది. ఆ తర్వాత దాదాపు 2 వేల రెయిన్ డీర్లకు ఆంత్రాక్స్ వ్యాపించింది. ఆ తర్వాత సంచార జీవులుగా ఉన్న నెనెట్స్ జాతి ప్రజలకూ బ్యాక్టీరియా వ్యాపించింది.
ఇప్పుడు కరోనా వైరస్ కూడా గబ్బిలమో, పామో, ఆలుగు లాంటి వన్యప్రాణుల నుంచే మానవాళికి వ్యాపించిందనే అంచనా ఉంది. కాగా ప్రస్తుతం ఆర్కిటిక్ ప్రాంతంలో భూతాపం కారణంగా రెట్టింపు స్థాయిలో వేడి పెరుగుతోంది.
Also Read:కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ వార్తలు... క్లారిటీ ఇచ్చిన సౌత్ కొరియా
దీంతో అక్కడి గడ్డ కట్టిన మంచు కరిగి వేల ఏళ్లుగా అందులో కూరుకుపోయిన బ్యాక్టీరియా, వైరస్ తిరిగి ప్రాణం పోసుకునే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ లాంటి భయంకర వైరస్‌లు దాడి చేస్తే, వాటిని ముందే అడ్డుకునేలా రకరకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి పెట్టుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.
సైబీరియాలో ఆంత్రాక్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 లక్షల డీర్‌లకు ఏటా ఆంత్రాక్స్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తూనే ఉన్నారు. నిద్రావస్థలో వున్న వైరస్‌లు నిద్ర నుంచి లేవకూడదంటే మనిషి భూతాపాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు హితవు పలుకుతున్నారు.