Asianet News TeluguAsianet News Telugu

కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ వార్తలు... క్లారిటీ ఇచ్చిన సౌత్ కొరియా

అడ్వైజర్ మూంగ్ చాంగ్ ఇన్  ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం జరిగిన ఇంటర్వ్యూలో కిమ్ జాంగ్ ఉన్న క్షేమంగానే ఉన్నారని చెప్పారు.

North Korea's Kim Jong Un "Alive And Well": South Korea
Author
Hyderabad, First Published Apr 27, 2020, 9:34 AM IST

ఉత్తర కొరియా అధ్యక్సన్ కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. దక్షిణ కొరియా ప్రకటించింది. 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బతికే బాగానే ఉన్నారని సౌత్ ప్రెసిడెంట్ మూన్ జే టాప్ సెక్యూరిటీ అడ్వైజర్ వ్యాఖ్యానించారు. కిమ్ ఓ యానివర్సరీకు వెళ్లారని చెప్పారు.

అడ్వైజర్ మూంగ్ చాంగ్ ఇన్  ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం జరిగిన ఇంటర్వ్యూలో కిమ్ జాంగ్ ఉన్న క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఏప్రిల్ 13నుంచి వొన్సాన్ లోని రిసార్ట్ లో ఉంటున్నారని తెలిపారు. ఎటువంటి అనుమానస్పద పరిస్థితులు కనిపించలేదని అంతా బాగానే ఉందని అన్నారు. 

ఏప్రిల్ 15న కిమ్ తాతగారి పుట్టినరోజు వేడుకల తర్వాత నుంచి దేశాధ్యక్షడు కిమ్.. కనిపించకుండాపోయారు.  అంతకుముందు ఏప్రిల్ 11న జరిగిన పార్టీ పాలిట్ బ్యురోకు కూడా హాజరుకాలేదు. దీంతో.. కిమ్ అనారోగ్యం సరిగా లేదంటూ వార్తలు వచ్చాయి.

ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యాడంటూ ఓ వార్త కథనం కూడా వెలువడింది. చైనా నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు వెళ్లి మరీ ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని అధికారులు ఖండిస్తున్నారు. అయితే.. వాళ్లు ఎంత ఖండించినా.. కిమ్ మాత్రం బయటకు రావడం లేదు.. ఎలాంటి అధికారిక కార్యక్రమంలోనూ హాజరుకాకపోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios