ఇస్లామాబాద్:మహిళల తప్పుల కారణంగా కరోనా వైరస్ మానవాళిపై తన విశ్వరూపం చూపుతోందని పాకిస్తాన్ కు చెందిన ఓ ప్రసిద్ద మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు టెలివిజన్ లైవ్ షోలో పాల్గొన్నారు. ప్రధానితో కలిసి  ప్రముఖ మతపెద్ద  మౌలానా తారిక్ జమీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఎహ్సాస్ టెలిథాన్ ' నిధుల సేకరణ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నట్టుగా ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మహిళలు పొట్టి పొట్టి దుస్తులు ధరించడమే కారణమన్నారు జమీల్. ఇలాంటి మహిళల ప్రవర్తనపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు.  అబద్దాలను ప్రచారం చేస్తూ మీడియా కూడ పబ్బం గడుపుతోందని ఆయన విమర్శలు గుప్పించారు.

also read:వుహాన్‌లో కరోనా కేసులు నిల్: రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

మీడియాపై వ్యాఖ్యలు చేసిన మత పెద్ద చివరకు తన తప్పును ఒప్పుకొన్నాడు. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన చివరకు మీడియాకు క్షమాపణలు చెప్పాడు. కానీ, మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం తారిక్ క్షమాపణ చెప్పలేదు.

మానవ హక్కుల కమిషన్ కూడ తారిక్ వ్యాఖ్యలను తప్పుబట్టింది.మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని మానవ హక్కుల అభిప్రాయపడింది. వివక్షపూరిత కామెంట్లు మీడియాలో ప్రసారమైతే సమాజంలో చెడు అభిప్రాయం ఏర్పడుతోందని కమిషన్ ట్వీట్ చేసింది.