కరోనా మహమ్మారి మానవాళిపై తన ప్రతాపాన్ని మరింతగా ఉద్ధృతం చేస్తోంది. సోమవారం సాయంత్రం నాటికి కోవిడ్-19 ధాటికి మరణించిన వారి సంఖ్య 15,189కి చేరింది. ఇందులో యూరప్‌కు చెందిన వారే 9,197 మంది ఉన్నారు.

Also Read:లాక్‌డౌన్‌ అమలుకు తెలంగాణ కఠినచర్యలు: మెడికల్ షాపులు తప్ప.. అన్నీ క్లోజ్

తాజాగా స్పెయిన్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది వైరస్ కారణంగా మరణించగా.. ఇందులో 462 మంది స్పెయిన్ దేశస్తులే ఉన్నారు.

దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2,182కి చేరినట్లు స్పెయిన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు కోవిడ్-19 బాధితుల సంఖ్య భారత్‌లోనూ క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 433 కేసులు నమోదవ్వగా ఏడుగురు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: 3 కాంటాక్ట్ కేసులు

మహారాష్ట్రలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో గత 24 గంటల్లో దాదాపు 100 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో అక్కడ మరణాల సంఖ్య 419కి చేరుకోగా, బాధితుల సంఖ్య 33,546కి చేరింది. చైనా, ఇటలీ తర్వాత అత్యధిక సంఖ్యలో వైరస్ బారిన పడిన వారు ఇక్కడే.