లాక్‌డౌన్‌ అమలుకు తెలంగాణ కఠినచర్యలు: మెడికల్ షాపులు తప్ప.. అన్నీ క్లోజ్

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ సర్కార్ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. లాక్‌డౌన్‌కు సంబంధించి అధికారికంగా జీవోను విడుదల చేసింది. రోడ్ల మీదకు వెళ్లేటప్పుడు బైక్ మీద అయితే ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని నిబంధన విధించింది.

Telangana Govt Issued Oreders on Lock down

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ సర్కార్ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. లాక్‌డౌన్‌కు సంబంధించి అధికారికంగా జీవోను విడుదల చేసింది. రోడ్ల మీదకు వెళ్లేటప్పుడు బైక్ మీద అయితే ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని నిబంధన విధించింది.

సాయంత్రం ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాయంత్రం 7 గంటల దాటాకా కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Also Read:తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: 3 కాంటాక్ట్ కేసులు

మరోవైపు ప్రజలు తమ నివాసాలకు కేవలం మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలి. ఆ పరిధి దాటితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ తెలిపింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు తమ తమ అడ్రస్ ప్రూఫ్‌లను వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

Also Read:లాక్‌డౌన్ ఆదేశాలు బేఖాతరు: కఠినచర్యలు తప్పవన్న సజ్జనార్

లాక్‌డౌన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. మరోవైపు లాక్‌డౌన్‌ను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్‌కు తెర లేపేందుకు అవకాశాలు ఉండటంతో తెలంగాణ సర్కార్ దానిపైనా దృష్టి సారించింది. నిత్యావసర వస్తువుల కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios