క్యాన్సర్ తో మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మృతి..
క్యాన్సర్ తో మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి చెందారు. 26యేళ్ల అనిపిన్న వయసులో ఆమె మృత్యువాత పడడం షాకింగ్ అని అభిమానులు అంటున్నారు.
ఉరుగ్వే : 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతిచెందారు. ఆమె గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. 26యేళ్ల వయసులో అక్టోబర్ 13న మరణించారని న్యూయార్క్ పోస్ట్ ఒక నివేదికలో పేర్కొంది. క్యాన్సర్ కు డి అర్మాస్ కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స చేయించుకున్నారు.
ఆమె మరణం ఉరుగ్వేతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియాలో ఆమె మరణం గురించి మాట్లాడుతూ "ఇంకా ఇంకా ఎప్పటికీ తిరిగిరాని ఎత్తులకు వెల్లింది మా చెల్లెలు" అన్నారు. మిస్ యూనివర్స్ ఉరుగ్వే 2022 కార్లా రొమెరో.. డి అర్మాస్ మృతిపై స్పందిస్తూ.. "నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత అందమైన మహిళల్లో ఒకరు" అని సంతాపం వ్యక్తం చేశారు.
ఆరేళ్ల ముస్లిం బాలుడిని 26సార్లు కత్తితో పొడిచి హత్య.. హమాస్ దాడికి ప్రతీకరంగా అమెరికాలో దారుణం..
"మిమ్మల్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీరు నాకు ఇచ్చిన మద్దతు మరువలేనిది. నేను ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్నారు. మీ ఆప్యాయత, మీ ఆనందం, మనం గడిపిన క్షణాలు.. మన స్నేహం.. అవన్నింటిలో మీరు నాతోనే ఉన్నారు".. అనిమిస్ ఉరుగ్వే 2021 లోలా డి లాస్ శాంటోస్ నివాళులు అర్పిస్తూ చెప్పారు.
చైనాలో నిర్వహించిన 2015 మిస్ వరల్డ్ పోటీలో 26 ఏళ్ల షెరికా డి అర్మాస్ టాప్ 30లో లేదు. అయితే, "పోటీ చేసిన ఆరుగురు 18 ఏళ్ల యువతులలో ఆమె ఒకరు"గా ఉన్నారు. ఆ సమయంలో నెట్‌ఉరుగ్వేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పింది. బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా, క్యాట్‌వాక్ మోడల్ అయినా నేను ఎప్పుడూ మోడల్‌గా ఉండాలనుకుంటున్నాను. ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటీ నాకు ఇష్టం.
అందాల పోటీలో, మిస్ యూనివర్స్‌లో పాల్గొనే అవకాశం ఏదైనా అమ్మాయి కల అని నేను అనుకుంటున్నాను. సవాళ్లతో నిండిన ఈ అనుభవాన్ని జీవించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత బ్యూటీ బిజినెస్ లోకి వచ్చింది. షే డి అర్మాస్ స్టూడియో అనే పేరుతో జుట్టు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించింది. మోడల్ తన సమయాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్‌కు కేటాయించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. "2018లో, ప్రపంచవ్యాప్తంగా 570,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా వేశారు. దాదాపు 311,000 మంది మహిళలు ఈ వ్యాధితో మరణించారు. ప్రభావవంతమైన ప్రాథమిక (HPV టీకా), ద్వితీయ నివారణ విధానాలు (పూర్వ క్యాన్సర్‌ల కోసం పరీక్షించడం,చికిత్స చేయడం) చాలా గర్భాశయ క్యాన్సర్ కేసులను నివారిస్తాయి" అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.