ఆరేళ్ల ముస్లిం బాలుడిని 26సార్లు కత్తితో పొడిచి హత్య.. హమాస్ దాడికి ప్రతీకరంగా అమెరికాలో దారుణం..
ఆరేళ్ల చిన్నారిని 26 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడో అమెరికన్ భూస్వామి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దానికి ప్రతీకారంగా బాలుడు, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడా అమెరికన్. వారు ముస్లింలు కావడంతో ప్రతీకారహత్యకు తెగబడ్డాడు.
వాషింగ్టన్ : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దానికి ప్రతీకార దాడి ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. ఓ భూస్వామి ఒక ముస్లిం మహిళ, ఆమె ఆరేళ్ల బాలుడిని పదులసార్లు కత్తితో పొడిచి ద్వేషపూరిత హత్యలకు పాల్పడ్డాడు. ఈ దాడిలో 26 సార్లు కత్తిపోట్లకు గురైన బాలుడు ఆసుపత్రిలో మరణించాడు, అయితే, అతని తల్లి అయిన 32 ఏళ్ల ప్రాణాలతో బయటపడిందని శనివారం ఇల్లినాయిస్ విల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం నుండి ఒక ప్రకటన తెలిపింది.
"ఈ క్రూరమైన దాడిలో ఇద్దరు బాధితులు ముస్లింలే. హమాస్- ఇజ్రాయెల్‌లకు మధ్య కొనసాగుతున్న వివాదానికి వారిద్దరినీ కారణాలుగా చూపుతూ వారిమీద దాడికి పాల్పడ్డారని’’ డిటెక్టివ్‌లు చెబుతున్నారు. బాధితులకు సంబంధించిన మరిన్ని వివరాలను లేదా జాతీయతను షెరీఫ్ కార్యాలయం తెలుపలేదు. కానీ, కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) చికాగో కార్యాలయం ఆ చిన్నారిని పాలస్తీనా-అమెరికన్‌గా తెలిపింది.
గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తే.. తర్వాతి పరిణామాలను ఎవరూ కంట్రోల్ చేయలేరు: ఇరాన్ వార్నింగ్
ఈ దాడిలో భూస్వామి జోసెఫ్ జుబాగాతో పోరాడిన 71 ఏళ్ల అనే మరో మహిళ 911కి కాల్ చేసిందని షెరీఫ్ కార్యాలయం అధికారులు తెలిపారు. "ఇద్దరు బాధితులను యజమాని నివాసంలోని బెడ్ రూంలో పోలీసు అధికారులు గుర్తించారు. బాధితులిద్దరికీ ఛాతీ, మొండెం, శరీరం పైభాగంలో అనేక కత్తిపోట్లు ఉన్నాయి" అని షెరీఫ్ ప్రకటన పేర్కొంది.
శవపరీక్ష సమయంలో బాలుడి పొత్తికడుపు నుంచి ఏడు అంగుళాల బ్లేడుతో కూడిన మిలటరీ తరహా కత్తిని బయటకు తీశారని ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి.. వారికి సమాచారం అందించిన జుబా నుదిటిపై గాయంతో ఇంటి వాకిట్లో నేలపై కూర్చుని కనిపించాడు. హత్య, హత్యాయత్నం లాంటి ద్వేషపూరిత నేరాల అభియోగాల మోసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
దాడి వివరాలు చెబుతూ.. "జుబా బాధితుల తలుపు తట్టి, వారిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించాడు. 'మీరు ముస్లింలు' చనిపోవాలి" అంటూ దాడికి దిగాడు అని సీఏఐఆర్ చికాగో కార్యాలయ అధిపతి అహ్మద్ రెహాబ్ విలేకరులతో తెలిపారు. హత్యకు గురైన బాలుడి తండ్రికి మహిళ తన ఆసుపత్రి నుండి పంపిన మెసేజ్ లతో ఈ విషయం తెలిసిందని తెలిపాడు.
ఈ దాడి "పీడకల" లాండిదన్నారు. ఇజ్రాయెల్ గత ఆదివారం హమాస్‌పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇప్పటికే వేలాదిమంది మృత్యువాత పడ్డారు.