dubai marina fire: దుబాయ్‌ లో ఉన్న 67 అంతస్తుల టవర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 3,820 మందిని సురక్షితంగా తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Fire in Dubai Marina tower: దుబాయ్ లోని 67 అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెరీనా పినాకిల్ (Marina Pinnacle Tiger Tower) గా పిలిచే ఈ భారీ బిల్డింగ్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్, పోలీస్, అత్యవసర వైద్య బృందాలు వెంటనే స్పందించగా, 764 అపార్ట్‌మెంట్లలో ఉన్న 3,820 మంది నివాసితులను సురక్షితంగా ఖాళీ చేశారు. ఎటువంటి గాయాలు లేదా మృతులు సంభవించలేదు అని అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఆరు గంటల పాటు అగ్నిమాపక చర్యలు

దుబాయ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు ఆరు గంటల పాటు పని చేశాయి. దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకారం, ఈ ఖాళీచేసే ప్రక్రియ ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తయ్యింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. ఇంకా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మంటల సమంయంలో కొంతమంది నివాసితులు అలారంలు పని చేయలేదని చెప్పారు. ఒక నివాసితుడు అరోన్‌ గల్ఫ్ న్యూస్‌కు మాట్లాడుతూ, "ఫైర్ అలారం వర్క్ అవ్వలేదు. మేము మొదట మంటల గురించి ఫైర్ ట్రక్కులు చూసినప్పుడు గానీ తెలియలేదు" అన్నారు.

అగ్నిప్రమాదం సమయంలో స్థానికులు బయటకు పరుగెత్తిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. "మేము నిద్రలో ఉన్నాం, అప్పుడు మంటలు వచ్చాయి. ఎలివేటర్ పనిచేసింది గనుక బయటకు వచ్చాం" అని బిల్డింగ్ లో ఉన్న ఒక వ్యక్తి చెప్పారు.

Scroll to load tweet…

దీని ప్రభావం పరిసర భవనాలపై కూడా కనిపించింది. MAG 218 అనే సమీప బిల్డింగ్ లోకి పెద్దగా పొగ రావడంతో దాన్నికూడా ఖాళీ చేయాల్సివచ్చిందని రిపోర్టులు స్థానిక మీడియా పేర్కొంది.

దుబాయ్ రోడ్లు, రవాణా సంస్థ (RTA) అప్రమత్తమై దుబాయ్ మెరీనా స్టేషన్ నుంచి పామ్ జుమైరా స్టేషన్ వరకు రవాణా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. బదులుగా షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. పూర్తి సేవలు భద్రతా తనిఖీలు పూర్తయ్యాకే పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.

2015లో కూడా ఇదే బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అదే సమయంలో సమీప టవర్ అయిన టార్చ్ 2015, 2017లో అగ్ని ప్రమాదానికి గురైంది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ఇక్కడి భవనాల భద్రతపై అనేకమంది నివాసితులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Scroll to load tweet…