Air India crash: ఎయిర్ ఇండియా విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో కూలిన ప్రమాదంలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ సబర్వాల్‌ మెసేజ్ లు ప్రమాదం విచారణలో కీలకంగా మారాయి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలట్ చివరి సందేశం

గుజరాత్‌లో అహ్మదాబాద్ సమీపంలోని మేగనినగర్ నివాస ప్రాంతంలో 242 మందితో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ మోడల్‌ ఇది, ఇది ఈ మోడల్‌కు సంబంధించిన మొట్టమొదటి ప్రాణహానికలిగించిన ప్రమాదంగా నమోదు అయింది.

పైలట్ చివరి మాటల్లో మేడే కాల్

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చివరిగా పైలట్ ఇచ్చిన సందేశంలో “మేడే, నో థ్రస్ట్, లూసింగ్ పర్, గోయింగ్‌ డౌన్‌, అనేబుల్ టూ లిఫ్ట్" అనే మాటలు ఉన్నాయి. ఇది విమానం టేకాఫ్ అయిన తర్వాత కొద్ది సెకన్లలోనే వచ్చింది. ఈ సంకేతం విమానం త్రస్ట్ లేకపోవడం, పవర్ కోల్పోవడం, ఎత్తు ఎగరలేకపోవడం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చినట్లు సూచిస్తోంది.

DGCA ప్రకారం, పైలట్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎటీసీ తర్వాతి కమ్యూనికేషన్‌కు స్పందన రాలేదు. విమానం తక్కువ ఎత్తులో నుంచే కూలిపోయింది. కెప్టెన్‌ సబర్వాల్‌ ఆఖరి సందేశం ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇంజిన్ పవర్ కోల్పోవడమే ఎయిరిండియా విమాన ప్రమాదనికి కారణమా?

వీడియోలు, ఆడియో, రాడార్ డేటా ప్రకారం విమానం టేకాఫ్ తర్వాత వేగాన్ని కోల్పోయింది. పైలట్ సందేశంతో పాటు విమానం గాల్లో ఎగరలేకపోయిన తీరు చూస్తే ఇంజిన్ త్రస్ట్ లేకపోవడం లేదా లిఫ్ట్ లోపించిందని అనుమానిస్తున్నారు. అదనంగా, విమానం ల్యాండింగ్ గేర్ క్రాష్ సమయంలో కూడా దిగిపోలేదు, ఇది సాధారణ టేకాఫ్ ప్రోటోకాల్స్‌ పాటించలేదనే అనుమానాలకు దారి తీసింది.

ఫ్లాప్స్, ల్యాండింగ్ గేర్ లో లోపంతోనే ఎయిరిండియా విమాన ప్రమాదమా?

విమానానికి అవసరమైన లిఫ్ట్ సాధించడానికి ఫ్లాప్స్‌ను విస్తరించాల్సిన అవసరం ఉంది. అవి విస్తరించకపోతే లేదా ముందుగానే వెనక్కి తీసుకుంటే లిఫ్ట్ తగ్గుతుంది. అదే సమయంలో ల్యాండింగ్ గేర్ కూడా చకచకా లోపలికి ముడిపెట్టాల్సి ఉంటుంది. ఇవి రెండూ ఒకేసారి లోపిస్తే, విమానానికి ఎగిరే శక్తి తక్కువవుతుంది.

పక్షుల ఢీకొట్టడం, ఇంధన సమస్యలపై అనుమానాలు

విమాన విమానాశ్రయం నుంచి పైకి ఎగిరే సమయంలో పక్షుల గుంపు ఇంజిన్‌లోకి వెళ్లి, రెండు ఇంజిన్లను పని చేయకుండా చేసిన అవకాశం ఉంది. ఇంధనంలో కలుషితం వల్ల ఇంజిన్ పవర్ సరఫరా నిలిచిపోయే అవకాశాలపై కూడా దృష్టి ఉంది. పైలట్ “నో త్రస్ట్” అని చెప్పడం దీనికి ఆధారంగా చెప్పవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

వాతావరణ ప్రభావం, మెకానికల్ లోపం కూడా కారణం కావచ్చు?

ప్రమాదం జరిగిన రోజు గుజరాత్‌లో ఉష్ణోగ్రతలు 40°Cకి పైగా నమోదయ్యాయి. వేడికి వాయు సాంద్రత తగ్గిపోతే విమానం ఎగిరేందుకు ఎక్కువ వేగం అవసరం అవుతుంది. ఇది కూడా ప్రభావితం చేసి వుండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెకానికల్ లోపం లేదా టేకాఫ్ కాన్ఫిగరేషన్ తప్పిదం కూడా కారణమై ఉండవచ్చు.

బ్లాక్ బాక్స్‌లపై దర్యాప్తు.. పరిశీలనలో బోయింగ్ 787 డ్రిమ్‌లైనర్

విమానంలోని రెండు బ్లాక్‌బాక్స్‌లు (Cockpit Voice Recorder, Flight Data Recorder) ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. పైలట్ డేటా, మెకానికల్ లోపం లేదా ఏదైనా కలయిక సమస్యను గుర్తించేందుకు ఈ సమాచారం కీలకం.

ఇండియా డిజీఏసీఏ ఎయిర్ ఇండియా యాజమాన్యానికి మిగిలిన డ్రిమ్‌లైనర్ విమానాలపై సేఫ్టీ చెక్‌లను ఆదేశించింది. యూకే సహా పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ దర్యాప్తులో భారత అధికారులకు సహకరిస్తున్నారు.

ఇదివరకు డ్రిమ్‌లైనర్‌లో బ్యాటరీ లోపాలు, ఇంధన లీకులు, ఇంజిన్ ఐసింగ్ వంటి సమస్యలు నమోదయ్యాయి. 2013లో రెండు బ్యాటరీ పేలుళ్ళ నేపథ్యంలో FAA పూర్తిగా ఈ మోడల్ విమానాల కార్యకలాపాలను నిలిపి వేసింది.