Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ హాలీవుడ్ నటి కిర్‌స్టీ అల్లే కన్నుమూత..

ప్రముఖ హాలీవుడ్ నటి కిర్‌స్టీ క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయారు. వచ్చే నెలలో ఆమెకు 72 ఏళ్లు పూర్తి కానున్నాయి. తన కెరీర్ లో ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది. 

Famous Hollywood actress Kirsty Alley passed away..
Author
First Published Dec 6, 2022, 9:02 AM IST

ప్రముఖ హాలీవుడ్ నటి కిర్‌స్టీ చనిపోయారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్, కుమార్తె లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ వారి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆమె ‘‘క్యాన్సర్‌ కు క్యాన్సర్ ఉందని ఇటీవల గుర్తించాం. దానితో పోరాడి మరణించిది.’’అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌లో 'మోడీ మోడీ' అంటూ నినాదాలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..

‘‘ఆమె గొప్ప శక్తితో పోరాడింది. ఆమె జీవితంలో అంతులేని ఆనందం, ముందుకు సాగే సాహసాలను మాకు వదిలేసి వెళ్లిపోయింది’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌లోని వైద్యులు, నర్సుల బృందం అద్భుతమైన చికిత్స అందించారు. వారి సంరక్షణకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’ అని తెలిపారు. 

నటి కిర్‌స్టీ అల్లే 1970లో మొదటగా బాబ్ అల్లీని వివాహం చేసుకుంది. 1977లో వారిద్దరూ విడిపోయారు. తరువాత పార్కర్ స్టీవెన్‌సన్‌ ను పెళ్లి చేసుకుంది. పార్కర్ స్టీవెన్‌సన్‌తో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా.. ఆమెకు వచ్చే నెలలో 72 ఏళ్లు పూర్తికానున్నాయి. 

డిప్రెషన్‌తో 10వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేసిన ఎన్నారై వ్యాపారి

ఆమె కుమారుడు, కుమార్తె ఓ ప్రకటనలో కిర్‌స్టీ అల్లే ను అద్భుతమైన, భయంకరమైన ప్రేమగల తల్లి గా అభివర్ణించారు.  తెరపై కనిపించినంత మాత్రాన తమని దాటి ఎప్పటికీ వెళ్లదని, ఆమె తల్లి, అమ్మమ్మగా గొప్ప ప్రేమానురాగాలను పంచిందని పేర్కొన్నారు. ‘‘మా తల్లి అభిరుచి, జీవితం పట్ల అభిరుచి ఏంటో తెలుసు. ఆమె పిల్లలు, మనుమలు, అనేక జంతువుల పట్ల ప్రేమ కనబర్చింది. ఆమె జీవితం మాకు ప్రేరణనిచ్చింది ’’ అని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ, ప్రార్థనలకు వారు  కృతజ్ఞతలు తెలిపారు.

అల్లే 1987 నుండి 1993 వరకు ఎన్ బీసీ సిట్‌కామ్ ‘‘చీర్స్’’లో రెబెక్కా హోవే పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు. ఈ పాత్ర కోసం ఆమె 1991లో ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్‌ను అందుకుంది  ఆమె ‘‘డ్రాప్ డెడ్ గార్జియస్’’, ‘‘వెరోనికాస్ క్లోసెట్’’, ‘‘ఇట్ టేక్స్ టూ’’, ‘‘సిబ్లింగ్ రివాల్రీ’’, ‘‘షూట్ టు కిల్’’, ‘‘లవర్‌బాయ్’’, ‘‘రన్అవే’’ వంటి డజన్ల కొద్దీ సినిమాలు చేశారు. అలాగే టీవీలో కార్యక్రమాల్లో హోస్ట్ గా కూడా వ్యవహరించారు. 

కొవిడ్ వైరస్ మనిషి తయారు చేసిందే.. వుహాన్ ల్యాబ్ నుంచే లీక్.. అమెరికా తప్పు కూడా ఉంది: వుహాన్ ల్యాబ్ సైంటిస్టు

అల్లే మరణం పట్ల ఆమె సహనటుడు జాన్ ట్రావోల్టా విచారం వ్యక్తం చేశారు. ‘‘కిర్స్టీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ’’ అని పేర్కొన్నారు.  “నేను నిన్ను ప్రేమిస్తున్నాను కిర్స్టీ. మనం మళ్ళీ ఒకరినొకరు చూస్తామని నాకు తెలుసు.’’ అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కాగా.. అల్లీ తన కెరీర్‌లో 76 యాక్టింగ్ క్రెడిట్‌లను దక్కించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios