Asianet News TeluguAsianet News Telugu

డిప్రెషన్‌తో 10వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేసిన ఎన్నారై వ్యాపారి

Mumbai: ముంయిలోని త‌న ఇంటి బాల్కనీ నుంచి దూకి ఎన్నారై వ్యాపారవేత్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కోలాబాలోని ఓ లగ్జరీ హోటల్‌ నిర్వహించే లగ్జరీ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వ్యక్తి పడి ఉన్నాడని ఓ అధికారి తెలిపారు.
 

NRI businessman jumps from 10th floor balcony due to depression in Mumbai
Author
First Published Dec 5, 2022, 11:59 PM IST

NRI Businessman Jumps Off Balcony: వ్యాపారంలో ఆర్థిక న‌ష్టాలు రావ‌డంతో డిప్రెషన్ లోకి జారుకున్న ఒక ఎన్నారై వ్యాపార‌వేత్త తాను నివాసం ఉంటున్న 10వ అంత‌స్తు బాల్కానీ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్ దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఎన్నారై వ్యాపారి 10 అంత‌స్తు బాల్కానీ నుంచి దూకిన ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. డిప్రెషన్‌తో బాధపడుతున్న 58 ఏళ్ల ఎన్నారై వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌత్ ముంబ‌యిలోని కోలాబాలోని తన నివాసంలోని 10వ అంతస్తు బాల్కనీ నుంచి ఆ వ్యక్తి దూకాడని పోలీసులు తెలిపిన‌ట్టు వార్త సంస్థ పీటీఐ నివేదించింది. వ్యాపారంలో నష్టాల కారణంగా వ్యాపారవేత్త ప్రాథమికంగా నిరాశకు గురయ్యాడు. అయితే, ఈ మ‌ధ్యే వ్యాపారవేత్త తన తల్లి పుట్టినరోజును జరుపుకోవడానికి ముంబ‌యికి వ‌చ్చిన‌ట్టు పోలీసులు తెలిపారు.

కోలాబాలోని ఒక లగ్జరీ హోటల్ నిర్వహించే లగ్జరీ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో వ్యక్తి పడి ఉన్నాడని ఒక అధికారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం వ్యాపారి 10వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. యూఏఈలో వ్యాపారంలో నష్టాలు రావడంతో సదరు వ్యాపారి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయితే, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అత‌ని కుటుంబ స‌భ్యుల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదును అందుకోలేద‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసినట్లు పీటీఐ నివేదిక తెలిపింది.

హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఎన్నారై వ్యాపారవేత్త సైరస్ ఇంజనీర్ కుమారుడు షారుక్ ఇంజనీర్ దుబాయ్‌లో కార్బోనిక్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించాడు. ఇది మొత్తం యూఏఈలో  ఫుడ్ గ్రేడ్ డ్రై ఐస్, అనుబంధ ఉత్పత్తుల స‌ర‌ఫరా, సంబంధిత‌ సేవలను అందించే వ్యాపారంలో ఉంది.  భార్య, ఇద్దరు కుమారులు కూడా దీనిపైనే ఆధారపడి ఉన్నారు. నవంబర్ 27న తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు ఇండియాకు వచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైనట్లు తన తండ్రి సైరస్, సోదరి తయూనాజ్ మర్చంట్‌తో జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గత రెండు నెల‌లుగా కొంతకాలంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక మానసికంగా కుంగిపోయాడు" అని కొలాబా పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక అధికారి తెలిపారు.

కాగా, దేశంలో న‌మోద‌వుతున్న ఆత్మ‌హ‌త్య‌ల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే చోటుచేసుకుంటున్నాయ‌ని ఇటీవ‌లి ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెల్లడించిన సమాచారం ప్రకారం, 2021లో నమోదైన ఆత్మహత్యల సంఖ్య పరంగా మహారాష్ట్ర వరుసగా మూడో సంవత్సరం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో 22,207 మంది, తమిళనాడులో 18,925 మంది, మధ్యప్రదేశ్‌లో 14,965 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగు మెగా మెట్రోపాలిటన్ నగరాల పరంగా, ముంబ‌యి గత సంవత్సరంలో ఆత్మహత్యల సంఖ్య పరంగా నాల్గవ స్థానంలో ఉంది. గత ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో మహారాష్ట్ర వాటా 13.5 శాతం.

Follow Us:
Download App:
  • android
  • ios