Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ లాహోర్ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరు మృతి


పాకిస్తాన్ లాహోర్‌లో  గురువారం నాడు ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

Factory boiler explosion in Lahore
Author
Lahore, First Published Oct 21, 2021, 4:52 PM IST

లాహోర్: పాకిస్తాన్ లాహోర్ లోని లాహోర్ ముల్తాన్ రోడ్డులోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు మరణించారు.ఈ పేలుడుకు భవనం అద్దాలు కూడ పగిలిపోయాయి. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పేలుడు తీవ్రత ఫ్యాక్టరీకి సమీపంలోని భవనాలపై కూడ ప్రభావం చూపింది. ఈ సమాచారం అందుకొన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పటివరకు  ఇద్దరు వ్యక్తులు మరణించారు.  ఈ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన సెక్యూరిటీ గార్డును ఆసుపత్రికి తరలించారు.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

also read:ఛత్తీస్‌‌గఢ్: రాయ్‌‌‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు.. నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు

ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు Social media లో వైరల్ గా మారాయి. బాయిలర్ పేలిన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.Pakistanలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం కాదు. గత ఏడాది డిసెంబర్ 22న కరాచీలోని ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఐస్ ఫ్యాక్టరీ బాయిలర్ లో పేలుడు చోటు చేసుకొంది. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.

ఇవాళ చోటు చేసుకొన్న ప్రమాదం చాలా పెద్ద ప్రమాదమనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బాయిలర్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో Karachi సమీపంలో Factory పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 50 మందిని ప్రమాదం నుండి రక్షించారు. శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తులను తరలించడానికి భారీ యంత్రాలను ఉపయోగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios