మయన్మార్ భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని కళ్లముందు కదలాడుతుండగానే మన పొరుగునే ఉన్న మరోదేశం అప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. 

Earthquake : మన చుట్టుపక్కల దేశాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే మయన్మార్ లో వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని మిగిల్చింది. థాయిలాండ్ ను కూడా భూకంపం అతాలాకుతలం చేసింది. ఈ దుర్ఘటనను మరిచిపోకముందే మన పొరుగుదేశం అప్ఘనిస్తాన్ లో మరో భూకంపం సంభవించింది.

శనివారం ఉదయం అప్ఘనిస్తాన్ లో భూమి కంపించిందని ... అయితే ఇది ప్రమాదకర స్థాయిలో జరగలేదని భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదయ్యింది... అంటే ఈ భూకంప పెద్ద ప్రమాదకరం కాదు. ఇదే మయన్మార్ స్థాయిలో వచ్చివుంటే మారణహోమం జరిగేది. 

శనివారం తెల్లవారుజామున 5.16 గంటలకు అప్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బాగా లోతులో భూకంప కేంద్రం ఉండటం, తీవ్రత కూడా తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. 

Scroll to load tweet…

మయన్మార్ లో భయానక పరిస్థితులు : 

శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్ లో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో భారీ భవనాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. దీంతో ఈ శిథిలాల కింద చిక్కుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తినష్టం మామూలుగా లేదు. మయన్మార్ లోని రెండో అతిపెద్ద నగరం మ్యాండలే ఈ భూకంపంతో మరుభూమిగా మారింది. ఎక్కడచూసినా కుప్పసకూలిన ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఆ శిథిలాల కింద ఎందరి మృతదేహాలు ఉన్నాయో అర్థం కావడంలేదు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయినట్లు మయన్మార్ అధికారులు అంచనా వేస్తున్నారు.

థాయిలాండ్ లో కూడా భూకంపం భీభత్సం సృష్టించింది. పర్యాటక నగరం బ్యాంకాక్ లో భూమి కంపించడంతో భారీ భవంతుల్లోని కదిలాయి. అయితే మయన్మార్ స్థాయిలో ఇక్కడ విధ్వంసం జరగలేదు. మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం వస్తే బ్యాంకాక్ లో 7.3 తీవ్రతతో భూమి కంపించింది. థాయిలాండ్ లోని కొన్ని ప్రాంతాలు ఈ భూకంపం దాటికి ధ్వంసమయ్యాయి... కొద్దిగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. 

భారత్ లోనూ భూకంపం : 

మయన్మార్ భూకంప ప్రభావం పొరుగుదేశాలపై కూడా పడింది. భారత్ తో పాటు బంగ్లాదేశ్‌, లావోస్‌, చైనాల్లోనూ భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్ తో పాటు మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

మయన్మార్ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ దేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. భూకంపం కారణంగా అతలాకుతలమైన ఆ దేశానికి ఆపన్నహస్తం అందించారు. ఇప్పటికే దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని మయన్మార్ కు తరలించారు. భూకంపం బాధిత ప్రాంతాల్లో భారత్ పంపిన నిత్యావసర సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. 

Scroll to load tweet…