Delmicron: ఒకవైపు ఒమిక్రాన్... మరోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్షన్.. !
Delmicron: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో పరిస్థితులు దారుణంగా మారగా, ఇప్పుడు ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దీనికి తోడు కొత్తగా డబుల్ వేరియంట్ డెల్మిక్రాన్ అమెరికాను టెన్షన్ పెడుతోంది.
Delmicron: 2019లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి ఇప్పటికీ కల్లోలం రేపుతోంది. వైరస్ కట్టడికి టీకాలు, పలు రకాల మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనే మ్యుటేషన్లకు లోనవుతూ.. మరింత ప్రమాదకరండా మారుతోంది. ఇదివరకు వెలుగుచూసిన కరోనా వైరస్ వేరియంట్లు డెల్టా, డెల్టా ప్లస్ ల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటికీ ఈ వేరియంట్ల ప్రభావం కొనసాగుతోంది. ఇదిలావుండగానే, దక్షిణాఫ్రికాలో గత నెలలో మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఇదివరకు వెలుగుచూసిన వాటికంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వ్యాప్తి సైతం అధికంగా ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికాలో నిత్యం లక్షకు పైగానే కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతుండగా, మరో కొత్త డబుల్ వేరియంట్ డెల్మిక్రాన్ అగ్రరాజ్యం అమెరికాను టెన్షన్ పెడుతోంది.
Also Read: Coronavirus: బ్రిటన్ లో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 1,22,186 కొత్త కేసులు.. లండన్‌లో ఏకంగా..
ఇప్పటికే కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు వణికిస్తుంటే.. ఆ రెండూ కలిసి ‘‘డెల్మిక్రాన్’’ డబుల్ వేరియంట్ గా మారి అమెరికాతో పాటు యూరప్ దేశాలకు భయాందోళనకు గురిచేస్తున్నది. రెండు వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల మ్యుటేషన్లతో ఏర్పడిన డెల్మిక్రాన్.. చాపకింద నీరులా వ్యాపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు అమెరికా, బ్రిటన్ దేశాలలో విపరీతంగా పెరగడానికి ఇదే కారణమని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఒక్కరోజే కొత్తగా రెండు లక్షలకు పైగా కరోనా వైరస్‌కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ లోనూ ఒక్కరోజులోనే లక్షకు పైగా కేసులు వెలుగుచూశాయి. అమెరికాలో గత 24 గంటల్లో 2,065,32 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదుకాగా, మళ్లీ ఇప్పుడు భారీగా ఇన్‌ఫెక్షన్లు వెగులుచూడగం కలకలం రేపుతోంది. అమెరికాలో ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య కూడా 73 శాతానికి పెరిగింది. ఈ తాజా కరోనా వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే డెల్టా + ఒమిక్రాన్ కలిపి రెండు వేరియంట్లు కలిపి ఈ కొత్త వేరియంట్ గా మారిందంటున్నారు.
ఇది కొత్త వేరియంట్ కాకాపోయినా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల కలయికగా నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా గురైతే దాన్ని డెల్మిక్రాన్‌గా పరిగణిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ బారినపడిన వ్యక్తుల్లో డెల్మిక్రాన్ కాస్త అటూ ఇటుగా జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి ఒకే రకమైన లక్షణాలు ఉంటున్నాయన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటుందనీ, ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు తక్కువగానే ఉంటాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ఆయా దేశాలు జాగ్రత్తగా పరిస్థితులను గమనిస్తున్నాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
Also Read: వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసింది.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు విమర్శలు