Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో క్రికెట్ వరల్డ్ కప్, దీపావళి వేడుకలు చూసేందుకు రండి - ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ ఆహ్వానం..

భారత్ లో జరిగిే క్రికెట్ వరల్డ్ కప్, దీపావళి వేడుకలు చూసేందుకు రావాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ను, అలాగే ఆ దేశ క్రికెట్ అభిమానులను ప్రధాని మోడీ ఆహ్వానించారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు ఇప్పుడు  'టీ20 మోడ్'లోకి ప్రవేశించాయని అన్నారు.

Come to see the Cricket World Cup and Diwali celebrations in India.. Modi invites the Prime Minister of Australia..ISR
Author
First Published May 24, 2023, 9:45 AM IST

ఈ ఏడాది చివరిలో భారత్ లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్, దీపావళి వేడుకలను వీక్షించేందుకు రావాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ను, అలాగే ఆస్ట్రేలియా అభిమానులను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సిడ్నీలో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని అల్బనీస్ తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు 'టీ20 మోడ్'లోకి ప్రవేశించాయని అన్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు చేయగా లేనిది.. ఇప్పుడు మోడీ చేస్తే తప్పా - కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

‘‘ఈ ఏడాది జరిగే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు చూసేందుకు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులందరినీ భారత్ కు ఆహ్వానిస్తున్నాను. ఆ సమయంలో భారత్ లో ఘనంగా జరిగే దీపావళి వేడుకలను కూడా వీక్షించవచ్చు. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి. ఇది మన సమగ్ర సంబంధాల లోతును, మన సంబంధాల పరిపక్వతను ప్రతిబింబిస్తుంది. క్రికెట్ భాషలో చెప్పాలంటే మన సంబంధాలు టీ20 మోడ్ లోకి ప్రవేశించాయి’’ అని అన్నారు. 

దారుణం.. ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఘటన

పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు గ్రీన్ హైడ్రోజన్ పై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మైనింగ్, కీలకమైన ఖనిజాల రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిపామని అన్నారు. ఆస్ట్రేలియాలో తనకు స్వాగతం పలికినందుకు ప్రధాని అల్బనీస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, ద్వైపాక్షిక వాణిజ్యంలో కొత్త మార్గాలను తెరుస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

వంట మనిషి కుమారుడు కలెక్టర్ కాబోతున్నారు.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన పేదింటి బిడ్డ రేవయ్య..

ఈ సమావేశం సందర్భంగా బెంగళూరులో కొత్త ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు. బ్రిస్బేన్ లో త్వరలో కొత్త భారతీయ కాన్సులేట్ ను ప్రారంభిస్తామని ఖుడోస్ బ్యాంక్ ఎరీనాలో జరిగిన ఒక గ్రాండ్ ఇండియన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోడీ చెప్పిన మరుసటి రోజే ఇది జరిగింది. కాగా.. 2014 నవంబర్ తర్వాత ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా-భారత్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ముగించాలన్న తమ ఉమ్మడి ఆకాంక్షను ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios