ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు చేయగా లేనిది.. ఇప్పుడు మోడీ చేస్తే తప్పా - కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
గతంలో ప్రధానిగా పని చేసిన కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు పార్లమెంట్ కు సంబంధించిన భవనాలను ప్రారంభించారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. మరి ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ పార్లమెంట్ భవనాన్ని ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించారు.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం మండిపడ్డారు. గతంలో అప్పటి ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు వరుసగా పార్లమెంట్ అనుబంధాన్ని, లైబ్రరీని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
దారుణం.. ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఘటన
‘‘1975 ఆగస్టులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటు అనుబంధాన్ని ప్రారంభించారు. తరువాత 1987 లో ప్రధాని రాజీవ్ గాంధీ పార్లమెంటు లైబ్రరీని ప్రారంభించారు. మీ (కాంగ్రెస్) ప్రభుత్వాధినేతలు వాటిని ప్రారంభించగలినప్పుడు.. మా ప్రభుత్వాధినేత ఎందుకు అలా చేయకూడదు ’’ అని ప్రశ్నించారు.
గూండాయిజం, డ్రగ్ మాఫియాను సహించబోం: సీఎం సిద్ధరామయ్య సీరియస్ వార్నింగ్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లులు ఆమోదం పొందిన బిల్లులకు తరువాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారని చెప్పారు. పార్లమెంట్ లో ఆమోదం పొందిన బిల్లులను నిలిపివేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ కు రాజ్యాంగాన్ని చదవడం రాదని, రెండు ఆర్టికల్స్ ను తప్పుగా చదివారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హర్దీప్ పురి ఈ విధంగా మాట్లాడారు.
అంతకు ముందు శశిథరూర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 60, 111 ప్రకారం.. పార్లమెంటు అధిపతిగా రాష్ట్రపతి భవనాన్ని ప్రారంభించాలని అన్నారు. ఈ భవన నిర్మాణం ప్రారంభానికి ముందు ప్రధాని భూమిపూజ చేయడం 'బిజ్జారే' అని పేర్కొన్నారు. కాగా.. కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి 2020 డిసెంబర్ లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం పదేపదే మర్యాదను అగౌరవపరుస్తోందని తెలిపారు. బీజేపీ- ఆరెస్సెస్ ప్రభుత్వంలో రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజం స్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు.
ఢిల్లీ కోర్టును అభ్యర్థించిన రాహుల్ గాంధీ.. అసలేం జరిగిందంటే.?
ఇదిలా ఉండగా.. మే 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని కానీ ప్రధాని కాదని వాదిస్తూ దాదాపు ఐదు ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.