అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని పాకిస్థాన్, చైనాలను భారత్ హెచ్చరించినా.. అవకాశం దొరికనప్పడుల్లా ఇరు దేశాలు విషం గక్కుతున్నాయి. జమ్ము కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.
జమ్ము కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నిస్తునే ఉంది. ఈ క్రమంలో దాయాది పాకిస్థాన్ కు పొరుగు దేశం చైనా వంత పాడుతోంది. ఇలా అవకాశం దొరికనప్పడుల్లా ఇరు దేశాలు విషం గక్కుతున్నాయి. వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాక్ ను,
ఆ దేశానికి వంతపాడుతున్న చైనాను .. మా అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని భారత్ పలు మార్లు హెచ్చరించిన.. తమ కుటిల బుద్దిని మార్చు కోవడం లేదు. తాజాగా మరోసారి కశ్మీర్ విషయంలో చైనా-పాకిస్థాన్ లు తమ కుటిల బుద్దిని ప్రదర్శించాయి.
కాశ్మీర్ సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని,పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ఏకపక్ష చర్యలు తీసుకోకుండా ఉండాలని చైనా పేర్కొంది. మీడియా సమావేశంలో పాక్ జర్నలిస్టు లేవనెత్తిన కాశ్మీర్ సమస్యపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సమాధానమిస్తూ.. కాశ్మీర్ అంశంపై తమ దేశ వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉందని అన్నారు. ఈ విషయం భారతదేశం, పాకిస్తాన్ మధ్య చరిత్రలో మిగిలిపోయిన సమస్యగా మారిందనీ, UN చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, సంబంధిత ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా శాంతియుత మార్గంలో సరిగ్గా పరిష్కరించుకోవాలని మావో అన్నారు. సంబంధిత పార్టీలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలి, అయితే వివాదాన్ని పరిష్కరించడానికి, ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి చర్చలు, సంప్రదింపులలో పాల్గొనాలని ఆమె అన్నారు.
కశ్మీర్ సమస్యపై ఇతర దేశాల జోక్యాన్ని భారత్ గతంలోనే తిరస్కరించింది. జమ్మూ & కాశ్మీర్ కేంద్రపాలితానికి సంబంధించిన విషయాలు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారాలని పేర్కొంది. చైనాతో సహా ఇతర దేశాలకు వ్యాఖ్యానించడానికి ఎటువంటి స్థానం లేదనీ, భారతదేశం తమ అంతర్గత సమస్యలపై బహిరంగ తీర్పుకు దూరంగా ఉందని వారు గమనించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చిలో పేర్కొంది. కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ నుండి వెలువడుతున్న సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి పాకిస్థాన్, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు చాలా వరకు స్తంభించిపోయాయి. జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని భారత్ పదే పదే పాకిస్థాన్‌కు చెప్పింది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ పేర్కొంది.
