Asianet News TeluguAsianet News Telugu

చైనాలో మళ్లీ కరోనా ఆంక్షల పర్వం.. 11 ప్రావిన్సుల్లో కేసుల పెరుగుదల

చైనాలో కరోనా కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. దేశంలోని 11 ప్రావిన్స్‌లో కొత్తగా కేసులు మళ్లీ రిపోర్ట్ అవుతున్నాయి. మరో వంద రోజుల్లో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించనున్న ఈ దేశంలో డెల్టా వేరియంట్ కేసులు నమోదవ్వడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్‌లో కేసులు భారీగా విజృంభించే అవకాశముందని చెబుతున్నారు.
 

china again imposing coronavirus restrictions amid rising cases
Author
New Delhi, First Published Oct 26, 2021, 5:15 PM IST

న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ కరోనా కలకలం రేగుతున్నది. వారం రోజుల్లో Delta Variant కేసులు వందను దాటాయి. మొత్తంగా చూసుకుంటే ఈ Cases తక్కువే అయినా, ఒక చోట కాకుండా చాలా ప్రాంతాల్లో ఈ కేసులు రిపోర్ట్ కావడమే ఆందోళనలకు తావిస్తున్నది. ప్రస్తుతం Chinaలో 11 Privinceలలో కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు, వింటర్ ఒలింపిక్స్‌ను మరో 100 రోజుల్లో ఈ దేశమే నిర్వహించాల్సి ఉన్నది. దీంతో కేసుల కట్టడికి చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఆంక్షల పర్వం మొదలైంది.

నలభై లక్షల జనాభాగల లాంజౌ నగరంలో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నది. ఎమర్జెన్సీ అయితే తప్పా లాంజౌ ప్రజలు బయట అడుగుపెట్టడానికి వీల్లేదు. కొత్తగా మరిన్ని కేసులు ఈ సిటీలో వెలుగుచూడటంతో ఈ రోజే లాక్‌డౌన్ Restrictions విధించింది. డెల్టా వేరియంట్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో సోమవారమే ఉత్తర చైనా ప్రజలపై కఠిన ఆంక్షలు విధించింది. బీజింగ్‌లోనూ టూరిస్టు సైట్‌లను మూసేసింది. నగర ప్రజలు ఇంటి గడప దాటవద్దని హెచ్చరించింది. 30వేల మంది రన్నర్లు పాల్గొనాల్సిన మారథాన్‌ను రద్దు చేసింది. 

Also Read: చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. డెల్టా వేరియంట్ విజృంభణ.. మరో ముప్పు తప్పదా?

చాంగ్‌పిన్ జిల్లాలో తొమ్మిది కేసులు నమోదవ్వగానే కనీసం 23వేల నివాసాల్లోని ప్రజలు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా వీరు బయటకు వెళ్లకుండా చూడటానికి కొందరు అబ్జర్వర్లను పెట్టింది. వీరు ప్రతి అపార్ట్‌మెంట్ బయట నిలుచుండి కాపలా కాస్తున్నారు. కాగా, అపార్ట్‌మెంట్ కాంపౌండ్ల దగ్గర లోహపు బారికేడ్లను పెట్టారు. స్థానికంగా కేసులు రిపోర్ట్ అయిన ప్రాంతం నుంచి బీజింగ్‌కు ఎంట్రీని నిషేధించారు. చైనా జీరో కేసు స్ట్రాటజీని అమలు చేస్తున్నది. అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నది.

డెల్టా వేరియంట్ కేసులు నమోదవడంతో స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్‌లో కచ్చితంగా కేసుల విజృంభించే ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 11 ప్రావిన్స్‌లలో కేసులు రిపోర్ట్ కావడం ఈ ఆందోళనలను రెట్టింపు చేస్తున్నాయి. దేశంలో 75శాతం ప్రజలు అంటే వందకోట్లకుపైగానే రెండు డోసులూ తీసుకున్నవారే ఉన్నారు. అయినప్పటికీ కేసులు మళ్లీ పెరుగుతుండటం గమనార్హం.  

ఆదివారం నాటికి 133 కేసులు రిపోర్ట్ అయ్యాయని, ఇందులో 106 కేసులు 13 టూర్ బృందాల్లో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ఈ టూరిస్టు బృందాలు ఒక ప్రావిన్స్ నుంచి ఇతర ప్రావిన్స్‌లకు పర్యటించారని వివరించారు. ఇన్నర్ మంగోలియా, గన్షు, నింగ్జియా, గుజౌ, బీజింగ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios