పాకిస్థాన్‌లోని క్వెట్టాలో బాంబ్ బ్లాస్.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
పాకిస్థాన్ లోని బోలాన్ జిల్లా క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

పాకిస్థాన్ లో మరో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బోలాన్ జిల్లాలోని క్వెట్టా- సీబీ జాతీయ రహదారిపై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. ఎఫ్‌సీ ముస్సా చెక్‌పాయింట్ సమీపంలో ఈ బ్లాస్ చోటు చేసుకుంది. రోడ్డు పక్కన జరిగిన పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని పాకిస్థాన్ మీడియా ‘డాన్’పేర్కొంది. క్షతగాత్రులను ధాదర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత: అమైలాయిడోసిస్‌తో పోరాడుతూ మృతి.. ఈ అరుదైన వ్యాధి గురించిన వివరాలు ఇవే..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు సంభవించినప్పుడు గాయపడిన సిబ్బంది ఒక అధికారి కారుకు కాపలాగా ఉన్నారు. అతడిని దాదర్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. భద్రతా బలగాలు పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుని దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేసేందుకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి అనేక వాహనాలు వెళ్లిపోతున్నాయి. బలూచిస్థాన్ పోస్ట్ ప్రకారం.. పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కారణంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశ ద్వారం సమీపంలో పేలుడు సంభవించింది.
గత కొంత కాలం నుంచి క్వెట్టాలో పేలుళ్లు, ఘోరమైన గ్యాస్ లీక్ ఘటనలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. అంతకు ముందు జనవరిలో క్వెట్టాలో గ్యాస్ లీక్ ఘటనల్లో కనీసం 16 మంది మరణించారు. నవంబర్ 2022లో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 27 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో 23 మంది పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఈ పేలుడు వల్ల ఓ పోలీసు ట్రక్కు బోల్తాపడి లోయలో పడిపోయిందని క్వెట్టా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గులాం అజ్ఫర్ మహేసర్ తెలిపారని ‘ఏఎన్ఐ’ నివేదించింది. ఈ పేలుడుకు తామే బాధ్యులమని తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ప్రకటించింది.