హిందూ దేవాలయాలపై దాడులను సహించబోము.. విధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు - భారత్, ఆస్ట్రేలియా
హిందూ దేవాలయాలపై జరిగే దాడులను సంహించబోమని భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానిలు స్పష్టం చేశారు. ఆలయాల విధ్వంసానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో మంగళవారం విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆస్ట్రేలియాలో దేవాలయాలను ధ్వంసం చేసిన సంఘటనల గురించి కూడా ఇందులో తాము మాట్లాడుకున్నారని ప్రధాని మోడీ తెలిపారు. ‘‘ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాలపై నేను, ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ గతంలో చర్చించాం. ఈ రోజు కూడా దీనిపై చర్చలు జరిపాం’’ అని చెప్పారు.
ఇలాంటి విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని హామీ ఇచ్చారని భారత ప్రధాని మోడీ తెలిపారు. ‘‘భారత్-ఆస్ట్రేలియా సంబంధాల మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంబంధాలను దెబ్బతీసే ఏ చర్యనూ మేం అంగీకరించము. భవిష్యత్తులో కూడా ఇలాంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పీఎం ఆల్బనీస్ నాకు హామీ ఇచ్చారు’’ అని మోడీ చెప్పారు.
దారుణం.. ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఘటన
కాగా.. ఈ ఏడాది మార్చిలో బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. ఆస్ట్రేలియాలో రెండు నెలల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఇది నాలుగోసారి. జనవరి 16వ తేదీన ఆస్ట్రేలియాలోని కారమ్ డౌన్స్ లోని శ్రీ శివ విష్ణు ఆలయాన్ని హిందూ వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. జనవరి 12న ఆస్ట్రేలియాలోని మిల్ పార్క్ లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ పై భారత్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక గ్రాఫిటీలు గీశారు.
భారత్ లో క్రికెట్ వరల్డ్ కప్, దీపావళి వేడుకలు చూసేందుకు రండి - ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ ఆహ్వానం..
ఇదిలా ఉండగా.. ఇరు దేశాల అగ్రనాయకుల చర్చలకు ముందు సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్ లో ప్రధాని మోడీకి గౌరవ వందనం సమర్పించారు. సిడ్నీలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే ఈ చర్చలు జరిగాయి.