దారుణం.. గర్భిణి కడుపు చీల్చి, పుట్టబోయే బిడ్డ తలనరికి చంపిన హమాస్ ఉగ్రవాదులు
ఇజ్రాయిల్ పౌరులపై హమాస్ దారుణాలకు పాల్పడుతోంది. అమాయకులను నిర్ధాక్షిణ్యంగా హతమారుస్తోంది. తాజాగా ఓ క్రూరమైన చర్యకు పాల్పడింది. ఇజ్రాయిల్ కు చెందిన ఓ గర్బిణి కడుపు చీల్చి, పుట్టబోయే బిడ్డ తలనరికింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై 17 రోజులు అవుతోంది. ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ఇరువైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది.
విషాదం.. రిటైర్డ్ ఏసీపీ ప్రదీప్ టెంకర్ ఆత్మహత్య..
ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన అమాయక పౌరులు ప్రాణాలు కూడా పోతున్నాయి. హమాస్ దళాలు చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా ఊచకోతకు పాల్పడుతున్నాయి. తాజాగా హమాస్ దళాలు మరో దారుణమైన ఘటనకు పాల్పడ్డాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వెల్లడించింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఓ నిండు గర్బిణి కడుపు కోసి, పుట్టబోయే బిడ్డ తల నరికి చంపారని ఐడీఎఫ్ ఆరోపించింది.
ఈ క్రూరమైన చర్యను ఐడీఎఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేధికగా వెల్లడించింది. తమ దేశానికి చెందిన మహిళ పట్ల హమాస్ క్రూరత్వానికి పాల్పడిందని ఎక్స్ పోస్టులో ఆరోపించింది. అయితే ఎక్స్ గైడ్ లైన్స్ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను షేర్ చేయలమేని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.
telangana weather : తెలంగాణలో మొదలైన చలి.. గజగజ వణుకుతున్న పల్లెలు..
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 2,055 మంది చిన్నారులు సహా 5,000 మందికి పైగా మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైపు పాలస్తీనా సాయుధ బృందాలు ప్రయోగించిన రాకెట్ల 550 విఫల కాల్పులు జరిగాయని, ఇందులో అనేక మంది పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.