చైనాలో మరో కరోనా మహమ్మారి విజృంభించవచ్చు - ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షి జెంగ్లీ హెచ్చరిక
భవిష్యత్తులో మరో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రముఖ చైనీస్ వైరాలజిస్టు డాక్టర్ షి జెంగ్లీ హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ -19 అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచం సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

చైనాలో మరో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ప్రముఖ చైనీస్ వైరాలజిస్టు డాక్టర్ షి జెంగ్లీ హెచ్చరించారు. ఆమె జంతు మూలల వైరస్ లపై విస్తృతంగా అధ్యయనం చేస్తుంటారు. అందుకే అందరూ ఆమెను ‘బ్యాట్ విమెన్’ అని పిలుస్తుంటారు. కొత్త కరోనా వైరస్ ఆవిర్భవించే అవకాశం ఉందని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ -19 మహమ్మారి వినాశకరమైన ప్రభావం నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ప్రపంచ మొత్తం సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ)లోని డాక్టర్ షి బృందం చేసిన అధ్యయనంలో 40 వేర్వేరు కరోనావైరస్ జాతులు జంతువుల నుండి మానవులకు వ్యాపించే ప్రమాదాన్ని అంచనా వేసింది. వీటిలో సగం అత్యంత ప్రమాదకరమైనవని వారు గుర్తించడం గమనార్హం. వీటిలో ఆరు ఇప్పటికే మానవులలో వ్యాధులకు కారణమయ్యాయని, మరో మూడు మానవులకు లేదా ఇతర జంతు జాతులకు సోకే సామర్థ్యం వాటికి ఉందని హాంకాంగ్ కు చెందిన పలు దినపత్రిక నివేదికలు చెబుతున్నాయి.
భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధి ఆవిర్భవించడం దాదాపు ఖాయమని, మరో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా డైనమిక్స్, జన్యు వైవిధ్యం, అతిథేయ జాతులు, జూనోసిస్ చారిత్రక సంఘటనలు.. జంతువుల నుండి మానవులకు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వైరల్ లక్షణాల సమగ్ర విశ్లేషణపై ఈ అంచనా ఆధారపడి ఉంటుంది.
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి.. కరెంట్ షాక్ తో 11 ఏళ్ల బాలుడు మృతి
జూలైలోనే ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనే ఇంగ్లీష్ జర్నల్ లో ఇవి ప్రచురితమైనప్పటికీ.. ఈ ప్రమాదకరమైన అధ్యయనం ఇటీవల చైనీస్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వివాదాస్పద వుహాన్ ఇనిస్టిట్యూట్ లో ఆమె చేసిన పని చుట్టూ ఉన్న సున్నితత్వాల కారణంగా డాక్టర్ షి తాజా పరిశోధనపై వ్యాఖ్యానించడానికి చైనా వైరాలజిస్టులను దూరంగా ఉంచింది.