Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో ఉన్న బావతో హిందీలో ఫోన్ మాట్లాడాడని.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికా కంపెనీ..

ఆఫీసు నుంచి ఇండియాలో ఉంటున్న తన బావకు వీడియో కాల్ చేసి, హిందీలో మాట్లాడాడని ఆ కంపెనీ భారత్ కు చెందిన ఇంజనీర్ ను ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు రక్షణ రహస్యాలను బయటకు చేరవేస్తున్నాడని అభియోగాలు మోపుతూ ఈ చర్యకు పూనుకుంది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.

An American company fired him for speaking on the phone in Hindi with his brother-in-law in India..ISR
Author
First Published Aug 2, 2023, 8:51 AM IST

అతడో ఇంజనీర్. చాలా ఏళ్ల కిందటే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఓ కంపెనీలో ఇంజనీర్ గా విశిష్ట సేవలు అందించారు. దానికి మెచ్చుకొని ఆ సంస్థ అతడికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. కానీ ఇండియాలో ఉంటున్న తన బావతో హిందీలో వీడియో కాల్ మాట్లాడని ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆయన నిరుద్యోగిగా మారాడు. ఇది గత అక్టోబర్ లో జరగ్గా.. బాధితుడు కోర్టుకు ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రత నమోదు

భారత్ కు చెందిన అనిల్‌ వర్ష్‌ణే తన భార్యతో కలిసి 1968లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే ఇంజనీర్ గా స్థిరపడ్డారు.అనిల్ భార్యకు కూడా 1989లో నాసాలో ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. దీంతో వారు ఆ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నారు. కాగా ప్రస్తుతం 78 ఏళ్ల వయస్సు ఉన్న అనిల్ హంట్స్‌విల్‌లోని ‘‘పార్సన్స్‌ కార్పొరేషన్‌’’ అనే సంస్థలో చాలా ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వ క్షిపణి రక్షణ సంస్థకు గగనతల రక్షణ సేవలు అందిస్తుంటుంది. ఆ సంస్థలో పని చేస్తున్న సమయంలో అమెరికా ప్రభుత్వం క్షిపణి రక్షణ సంస్థకు 50 లక్షల డాలర్లను ఆదా కూడా చేశారు. దీంతో ఆయనకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా అందించి ఆ సంస్థ సత్కరించింది. 

అల్లరిమూక ఆగడాలకు విద్యార్థిని బలి.. వేధిస్తూ, బలవంతంగా శానిటైజర్ తాగించి, అడ్డొచ్చిన సోదరుడిపై కూడా..

ఇదిలా ఉండగా ఇండియాలో నివసించే అనిల్ బావ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడనే సమాచారం అనిల్ చేరింది. దీంతో బావతో మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుందో లేదో అని, కడసారిగా ప్రేమతో మాట్లాడుదామనే ఉద్దేశంతో ఆయన గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన ఆఫీసులోని ఓ గదికి వెళ్లి వీడియో కాల్ చేశారు. తన బావను వీడియో కాల్ లో చూస్తూ, హిందీలో ఫోన్ మాట్లాడాడు. వీరిద్దరి మధ్య రెండు, మూడు నిమిషాలుగా సంభాషణ సాగుతున్న సమయంలో అక్కడ పని చేసే ఓ ఉద్యోగి దీనిని గమనించాడు. ఇక్కడ వీడియో కాల్ మాట్లాడకూదని చెప్పడంతో అనిల్ వెటనే కాల్ కట్ చేశాడు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫైనల్ కీ విడుదల.. ఎనిమిది ప్రశ్నలను తొలగించిన టీఎస్‌పీఎస్సీ..

ఆ సహోద్యోగికి హిందీ భాష తెలియదు. దీంతో అనిల్ అమెరికా రక్షణ సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు పంపిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈ విషయాన్ని తన సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. అతడిని గూఢచారిగా  అనుమిస్తూ ఎండీఏ విచారణ చేపట్టింది. కానీ అందులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ ఆ సంస్థ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోలేదు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, లేకపోతే తిరిగి ఉద్యోగంలోకి అయినా తీసుకోవాలని అనిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios