Asianet News TeluguAsianet News Telugu

మంచు తుఫానుతో వణికిపోతున్న అమెరికా.. 50 మంది మృతి..

మంచు తుఫాను అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తం వీపరీతంగా మంచు కురుస్తోంది. న్యూయార్క్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ మంచు తుఫాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు 50 మంది మరణించారు. 

America shivering with snow storm.. 50 people died..
Author
First Published Dec 27, 2022, 9:07 AM IST

అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. రోడ్డుపై మంచుపేరుకుపోవడంతో ప్రమాదాలు జరగుతున్నాయి. ఈ మంచు తుఫాను ప్రారంభమైన దగ్గర నుంచి శీతల గాలుల వల్ల, అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 50 మంది మరణించారు.

షాకింగ్.. బాయ్ ఫ్రెండ్ కు అక్క న్యూడ్ వీడియోలు పంపిన చెల్లెలు.. బ్లాక్ మెయిల్ చేసి..

తాజా వాతావరణ పరిస్థితుల వల్ల తొమ్మిది రాష్ట్రాల్లో విస్తృతంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. చాలా రోడ్లు బ్లాక్ అయ్యాయి. న్యూయార్క్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భీకరమైన మంచు తుఫాను, శీతల గాలులు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వల్ల ఇటీవలి రోజుల్లో 15,000 కంటే ఎక్కువ యూఎస్ విమానాలను అధికారులు రద్దు చేశారు. 

అమెరికా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం అనేక అడుగుల ఎత్తుతో మంచుపేరుకుపోయింది. అత్యవసర సేవలు అందించేందుకు కూడా అధికారులు కష్టపడుతున్నారు. ఈ పరిస్థితిపై ఎరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోన్‌కార్జ్ మాట్లాడుతూ.. మంచు తుఫాను మరణాల సంఖ్య కౌంటీ వ్యాప్తంగా 25కి చేరుకుందని అన్నారు. 1977లో సంభవించిన మంచు తుఫాను కంటే ప్రస్తుత తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 30 మంది మరణించారని అన్నారు. తాజా తుఫాను వల్ల మరెన్నో మరణాలు ఉంటాయని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.

శనివారం నాటికి ఈ  తుఫాను వల్ల దాదాపు 1.7 మిలియన్ల మంది ప్రజలు కొరికే చలిలో విద్యుత్తు లేకుండా చిక్కుకుపోయారు. విద్యుత్ సబ్ స్టేషన్లు పని చేయడం లేదు. ఓ సబ్‌స్టేషన్ అయితే 18 అడుగుల మంచుతో కప్పబడిందనిసీనియర్ కౌంటీ అధికారి తెలిపారు. బఫెలో అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం వరకు మూసివేయబడింది. ఎరీ కౌంటీలో చాలా వరకు డ్రైవింగ్ నిషేధం అమలులో ఉంది.

యాక్సిడెంట్ అయ్యిందని పరామర్శించబోతే.. కట్టేసి, చెప్పులతో కొట్టారు...

రోడ్డుపై మొత్తం మంచు పేరుకుపోవడంతో దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గంలను తాత్కాలికంగా మూసివేశారు. వీటిలో క్రాస్ కంట్రీ ఇంటర్‌స్టేట్ 70 హైవేలోని కొంత భాగం కూడా ఉంది. డ్రైవర్లు రోడ్లపైకి రావద్దని అధికారులు హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios