Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. బాయ్ ఫ్రెండ్ కు అక్క న్యూడ్ వీడియోలు పంపిన చెల్లెలు.. బ్లాక్ మెయిల్ చేసి..

తన ప్రేమను వ్యతిరేకించిందని అక్క న్యూడ్ వీడియో తీసి ప్రియుడికి పంపిందో చెల్లెలు. దాన్ని వేరే నెంబర్ తో ఆమెకే పంపి బ్లాక్ మెయిల్ చేశారు. 

girl sent nude videos of elder sister  to boyfriend, and blockmailed extort money
Author
First Published Dec 27, 2022, 8:51 AM IST

న్యూఢిల్లీ : మానవసంబంధాలు మృగ్యమవుతున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే డబ్బుల కోసం సొంత సోదరిపై దారుణానికి ఒడిగట్టిన ఓ చెల్లి ఘటన ఇది. తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి.. అక్క ప్రైవేట్ వీడియోను వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది ఓ చెల్లెలు. చివరికి ప్రియుడితో సహా, పట్టుబడి పోలీస్ స్టేషన్ లో ఉంది. షాక్ కలిగించే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే...

ప్రియుడితో తన సంబంధాన్ని కాపాడుకునేందుకు ఓ చెల్లి దారుణానికి ఒడిగట్టింది. అక్క నగ్న వీడియోను ప్రియుడికి పంపింది. అతను దాన్ని వేరే నంబర్ నుంచి అక్కకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆమె భయపడి వారడిగిన డబ్బులు ఇచ్చింది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. దర్యాప్తు చేయడంతో ఓ అమ్మాయిని, ఆమె ప్రియుడితో కలిసి అరెస్ట్ చేసినట్లు  సోమవారం తెలిపారు. దీనిమీద వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 15న తమకు దీనిమీద ఫిర్యాదు అందిందని,  తెలియని నంబర్ నుంచి వాట్సాప్‌లో తనకు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో వచ్చిందని, రూ.20వేలు డిమాండ్ చేస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తాము అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోను బయటపెడతానని పంపిన వ్యక్తి ఆమెను బెదిరించాడు.

యాక్సిడెంట్ అయ్యిందని పరామర్శించబోతే.. కట్టేసి, చెప్పులతో కొట్టారు...

"ఈ వీడియో తన ప్రైవేట్ క్షణాలదని.. అది ఎలా వేరే వాళ్లకు చేరిందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తామని బెదిరించి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354C, D, 384 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాం" అని పోలీసులు తెలిపారు. ఆ తరువాత దర్యాప్తులో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు బృందం సేకరించింది. సాంకేతిక విశ్లేషణల ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.

పోలీసులు ఈ కేసులో దేవరాజ్ అలియాస్ దేవ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసింది. విచారణలో నిందితుడు దేవ్‌రాజ్‌ చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. అతను బాధితురాలి చెల్లెలి పొరుగింట్లో ఉంటానని.. ఆమె, తాను ప్రేమించుకున్నామని తెలిపాడు. అంతేకాదు ఈ వీడియో లీక్ విషయంలో బాధితురాలి చెల్లెలికి ప్రమేయం ఉందని కూడా వెల్లడించాడు. అతను అందించిన సమాచారం ప్రకారం పోలీసులు బాధితురాలి చెల్లెల్ని అరెస్టు చేశారు. నిందితుడు, బాధితురాలి చెల్లెలు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, అయితే ఈ విషయం తెలిసి బాధితురాలు దీన్ని వ్యతిరేకించింది. దీంతో అక్క మీద కోపంతో.. తన ప్రేమను కాపాడుకోవాలని, అలాగే కాస్త డబ్బులు దండుకోవాలని ఈ దాడుణానికి ఒడిగట్టారు.

"చెల్లెలు తన అక్కను నగ్నంగా చిత్రీకరించింది. ఆ తరువాత ఆ వీడియో గురించి తన ప్రియుడు దేవరాజ్‌కు చెప్పింది. దానిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ చేస్తామని బెదిరించి.. తమ దారికి తెచ్చుకోవాలని ప్లాన్ చేసారు. దీంతో చెల్లెలు.. అక్క ప్రైవేట్‌ వీడియోను ప్రియుడికి ఇచ్చింది. ఆ వీడియోను దేవ్‌రాజ్‌ నకిలీ నంబర్‌తో వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేసి ఆమె దగ్గర్నుండి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేశాడు. ఈ చర్య ద్వారా తమ సంబంధాన్ని కాపాడుకోవడంతోపాటు, కొంత ఆర్థిక సాయం కూడా పొందేందుకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios