Asianet News TeluguAsianet News Telugu

నిప్పుతో చెలగాటం వద్దు.. బైడెన్‌కు చైనా అధ్యక్షుడు వార్నింగ్.. తైవాన్‌పై ఇరువురి ఘాటు వ్యాఖ్యలు

తైవాన్ దేశంపై అమెరికా, చైనాల మధ్య కొద్ది రోజులుగా ఘర్షణాపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ చైనా అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ నేతలు స్పష్టం చేశారు. కానీ, తైవాన్‌పై దాడికి వస్తే దాని స్వీయరక్షణకు ఆయుధాలు అందించి మద్దతిస్తామని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనా దేశాల అధ్యక్షులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ను పేర్కొంటూ నిప్పుతో చెలగాటమాడొద్దని, అలా ఆడితే వారికే గాయాలవుతాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు.
 

america china president met and discussed on taiwan
Author
New Delhi, First Published Nov 16, 2021, 1:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయంగా America, Chinaల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొని ఉంది. వాణిజ్యం, సాంకేతికత, మిలిటరీ, పసిఫిక్ రీజియన్, Taiwan అంశం మొదలు చాలా విషయాల్లో ఈ రెండు దేశాల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తైవాన్ అంశం కాక మీద ఉన్నది. తైవాన్‌ తమ దేశంలోని అంతర్భాగమని చైనా స్పష్టం చేసింది. తైవాన్ దాని స్వాతంత్ర్యం కోసం హద్దు మీరితే అణచివేస్తామని హెచ్చరించింది కూడా. అవసరమైతే సైనిక చర్య ద్వారానైనా దాన్ని తనలో కలిపేసుకోవడానికి వెనుకాడబోమని పలుసార్లు స్పష్టం చేసింది. కాగా, తైవాన్‌కు మద్దతు ఇస్తూ అమెరికా కూడా చాలా సార్లు ప్రకటనలు చేసింది. తైవాన్‌ దాని స్వీయరక్షణకు అవసరమైతే Weapons పంపడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ ప్రభుత్వం కూడా తెలిపింది. అయితే, తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించబోమని, కానీ, దానికి ఆయుధాలు పంపడానికి వెనుకాడబోమని వివరించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ
సమావేశంలో తైవాన్ అంశం చుట్టూ ఇరుదేశాల నాయకులు ఘాటుగా వ్యాఖ్యలు చేసుకున్నారు. 

సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ఆన్‌లైన్ సమావేశం జరిగింది. ఈ Meetingకు షెడ్యూల్డ్ సమయాని కంటే ఎక్కువ సేపు జరిగింది. సుమారు మూడున్నర గంటలపాటు వీరు చర్చించుకున్నారు. ఇందులో తైవాన్‌పై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. అమెరికా అధ్యక్షుడు Joe Bidenకు Warning ఇచ్చారు.

Also Read: పాశ్చాత్య దేశాలకు రష్యాకు మధ్య యుద్ధం జరగవచ్చు.. బ్రిటన్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలు

‘అమెరికాకు చెందిన కొందరు వ్యక్తులు తైవాన్‌ను ఉపయోగించి చైనాను కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. నిప్పుతో చెలగాటం ఆడటం వంటిదే ఇది. నిప్పుతో చెలగాటమాడిన వారికే గాయాలవుతాయి’ అని జీ జిన్‌పింగ్ అన్నారు. కాగా, దీనికి సమాధానంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వ్యూహాత్మకంగా మాట్లాడారు. చైనా వన్ నేషన్ పాలసీని అమెరికా గుర్తించడానికి కట్టుబడే ఉన్నదని వివరించారు. అంతేకాదు, అంతేకాదు, తైవాన్ చుట్టూ శాంతి, సుస్థిరత్వాన్ని భంగం కలిగించే చర్యలు, యథాతథ స్థితిని ఉల్లంఘించే చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. చైనా వన్ నేషన్ పాలసీ అంటే.. చైనా ఒకే రాజ్యంగా గుర్తించడం. యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పడం ద్వారా అటు చైనాకు, ఇటు తైవాన్‌కు జో బైడెన్ సమాధానం ఇచ్చారు. యథాతథ స్థితినికొనసాగించాలని పేర్కొంటూ చైనా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకోబోమని చెప్పారు. అలాగే, తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించడం లేదని ఇది వరకే ఉన్న అమెరికా పాలసీని మరోసారి పునరుద్ఘాటించారు. చైనా యథాతథ స్థితిని ఉల్లంఘిస్తే.. తైవాన్‌కు ఆయుధాలు పంపే తన ప్రకటనకూ నర్మగర్భంగా సమర్థించుకున్నారు.

Also Read: జైలులో గ్యాంగ్ వార్.. 68 మంది మృతి.. డ్రగ్స్ రవాణాపై ఆధిపత్యం కోసం ఘర్షణలు!

అమెరికా ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నప్పటి నుంచే జీ జిన్‌పింగ్‌తో సత్సంబంధాలు నెరపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జీ జిన్‌పింగ్ సమావేశం ప్రారంభంలోనే మై ఓల్డ్ ఫ్రెండ్ అని సంబోధించారు. తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, టెక్నాలజీ, ఇతర రంగాల్లో గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉన్న పోటీ ఉద్దేశపూర్వకంగా లేదా ఆకస్మికంగానైనా విభేదాలుగా మారకుండా చూసుకోవాలని ఉభయ దేశాధ్యక్షులు తీర్మానించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios