పాశ్చాత్య దేశాలకు రష్యాకు మధ్య యుద్ధం జరగవచ్చు.. బ్రిటన్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలు

పాశ్చాత్య దేశాలకు, రష్యాకు మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. రష్యా మిత్రదేశం బెలారస్‌లో వలసదారులను ఈయూ దేశమైన పోలాండ్ సరిహద్దుకు పంపి మానవ సంక్షోభానికి దారి వేస్తున్నదని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితులే రష్యా, నాటో మధ్య యుద్ధానికి దారి తీయవచ్చునని బ్రిటన్ ఆర్మీ చీఫ్ జనరల్ నిక్ కార్టర్ హెచ్చరించారు.

war may broke between russia and west countries says britain army chief

న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధం ముగిసన తర్వాత అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం(Cold War) నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ పరిస్థితులను రెండు ధ్రువాల ప్రపంచంగా విశ్లేషకులు చమత్కరించేవారు. అంటే Russia గ్రూపు.. America గ్రూపుగా పేర్కొనేవారు. ఈ రెండు దేశాలతోనూ సమాన దూరాన్ని పాటించిన దేశాలూ ఉన్నా.. పెద్ద సంఖ్యలో లేవు. ఆ తర్వాత ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అగ్రరాజ్యంగా అమెరికా ఆవిర్భవించింది. ఇప్పటికీ చాలా వరకు అమెరికా పెత్తనమే కనిపిస్తున్నా.. ఈ ఆధిపత్యం ఎంతో కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, రష్యా దేశాలకు సంబంధం లేకుండా ఎన్నో కూటములు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయా భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా కూటములు ఏర్పడి శాంతి, స్థిరత్వాలకు బీజం వేసుకుంటున్నాయి. ఆర్థిక, వాణిజ్య, సైనిక, సాంకేతిక అంశాల్లో పరస్పరం సహాయం చేసుకుంటున్నాయి. ఇవే బహుళపాక్షిక సంబంధాలుగా మారుతున్నాయి. అంటే మల్టీ పోలర్ తీరు ఆవిష్కృతమవుతున్నది. అంటే అగ్ర రాజ్యం అని కాకుండా వేటికవే కొన్ని కూటములతో తమదైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటున్నాయి. నేటి పరిస్థితి ఇదే. తాజాగా, బ్రిటన్ ఆర్మీ చీఫ్ ఈ విషయంపైనే కలవరం చెందారు.

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలకు రష్యాకు మధ్య యుద్ధం నెలకొనే పరిస్థితులు ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ ఆర్మీ చీఫ్ జనరల్ నిక్ కార్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దేశదేశాల మధ్య ఉండే సాంప్రదాయ దౌత్య మార్గాలు ఇప్పుడు చాలా వరకు మూసుకుపోయాయని వివరించారు. నేటి మల్టీపోలార్ వరల్డ్‌లో ఉద్రిక్తతలు సులువగా ఏర్పడే ముప్పు ఉన్నదని తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వాలు వేటికవే పూర్తిగా భిన్న లక్ష్యాలు కలిగి ఉంటున్నాయని, వేర్వేరు ఎజెండాలు అమలు జరుపుతున్నాయని చెప్పారు.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

రాజకీయ నాయకుల జగడాల మారితనాన్ని, తెంపరి తనాన్ని ప్రజలు ఆమోదించవద్దని ఆయన సూచించారు. తద్వారా ఉద్రికత్తలు మరింత పెరిగి యుద్ధాలకూ దారి తీయవచ్చు అని అన్నారు.

ఇటీవలి వారాల్లో తూర్పు యూరప్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యాకు సన్నిహిత దేశం బెలారస్. ఈ దేశం నుంచి వేలాది మందిగా ఈయూ సభ్య దేశం పోలాండ్ సరిహద్దు వైపుగా తరలిస్తున్నదని ఈయూ ఆరోపిస్తున్నది. తద్వార పోలాండ్ సరిహద్దులో మానవ సంక్షోభాన్ని సృష్టించడానికి కుట్ర చేస్తున్నదని పేర్కొంది. ఈ వివాదమే రష్యా, నాటో మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశముందని విశ్లేషణలు వస్తున్నాయి. 

బ్లాక్ సీలో ముందస్తు సూచనలు లేకుండా నాటో బలగాలు డ్రిల్స్ చేపట్టాయని, ఇది మాస్కో భద్రతకు సవాలు విసురుతున్నదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. బెలారస్ బార్డర్‌లో జరుగుతున్న పరిణామాలకు తమకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేవారు.

Also Read: చైనా దాడిచేస్తే తైవాన్‌కు అండగా నిలుస్తాం.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆర్మీ చీఫ్ కార్టర్ పై ఆందోళనలు వ్యక్తపరిచారు. అథారిటేరియన్ ప్రభుత్వాలు ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఎంతటి మార్గమైనా అనుసరిస్తారని అన్నారు. గ్యాస్ ధరలు పెంచడం, లేదా వలసలు, సైబర్ దాడులు, యుద్ధ వాతావరణ సృష్టించడానికీ తెగబడుతాయని ఆరోపించారు. గతంతో పోలిస్తే నేడు యుద్ధ రీతుల్లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యాలు అగ్రదేశాలుగా ఉన్నప్పుడు.. ఆ తర్వాత అమెరికా అగ్రరాజ్యంగా ఆవిర్భవించిన తర్వాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని వివరించారు. అప్పటి కంటే ఇప్పుడు దౌత్యవేత్తలకు సవాళ్లు ముదిరాయని చెప్పారు. సాంప్రదాయ దౌత్య పరికరాలు, పద్ధతులు చాలా వరకు అందుబాటులో లేవని అన్నారు. ఇలాంటి మార్గాలు మూసుకుపోయినప్పుడు చిన్నపాటి ఉద్రిక్తతలూ యుద్ధాలకు దారి తీయవచ్చునని వివరించారు. నిజానికి అందరూ దౌత్య మార్గాలను పునరుద్ధరించడానికే పోరాడాలని... మనం చేయాల్సిన యుద్ధం అదే అని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios