Asianet News TeluguAsianet News Telugu

అఖండ భారత్ మ్యాప్ వివాదం : భారత భూభాగాలను కలుపుకొని ఆఫీసులో ‘గ్రేటర్ నేపాల్’ మ్యాప్ పెట్టిన ఖాట్మండు మేయర్

పార్లమెంట్ కొత్త భవనంలో ఏర్పాటు చేసిన అఖండ భారత్ మ్యాప్ పై నేపాల్ లో రాజకీయ రగడ సాగుతోంది. ఈ మ్యాప్ పై ప్రతిపక్ష పార్టీలు అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాట్మండు మేయర్ తన కార్యాలయంలో ‘గ్రేటర్ నేపాల్’ మ్యాప్ ను ఉంచారు. ఇందులో భారత్ లోని కొన్ని భూభాగాలు కనిపిస్తున్నాయి. 

Akhanda Bharat Map Controversy: Kathmandu Mayor Puts 'Greater Nepal' Map In Office Including Indian Territories..ISR
Author
First Published Jun 9, 2023, 8:37 AM IST

కొత్త పార్లమెంటు భవనంలో ఉంచిన భారతదేశ 'అఖండ భారత్ మ్యాప్'పై వివాదం ముదురుతోంది. అఖండ భారత్ మ్యాప్ లో నేపాల్ భూభాగం కనిపిస్తుండటంతో అక్కడి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నేపాల్ ప్రభుత్వం ఈ అంశంపై మౌనంగా ఉన్నప్పటికీ, సీపీఎన్-యుఎంఎల్ తో సహా ప్రతిపక్ష పార్టీలు హిమాలయ దేశాన్ని పురాతన భారతీయ భూభాగంలో భాగంగా చూపించే మ్యాప్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరాయి. 

హిజాబ్ వివాదం.. పాఠశాలల్లో మత మార్పిడికి పాల్పడితే ఊరుకోబోము - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

ఈ నేపథ్యంలో ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా కొత్త 'గ్రేటర్ నేపాల్' మ్యాప్ ను తన కార్యాలయంలో ప్రదర్శించారు. ఇందులో భారత్ కు సంబంధించిన భూభాగం కనిపిస్తోంది. ప్రస్తుతం భార్య చికిత్స కోసం బెంగళూరులో ఉన్న మేయర్ షా.. తన భారత పర్యటనకు ముందు ఈ మ్యాప్ ను తన కార్యాలయంలో ఉంచారు.  ఈ 'గ్రేటర్ నేపాల్' మ్యాప్ లో తూర్పు తీస్తా నుంచి పశ్చిమ కాంగ్రా వరకు ప్రస్తుతం భారత భూభాగాలుగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. దీని ప్రకారం ఆ భూములను భారత్ నేపాల్ కు తిరిగి ఇవ్వాలన్న వాదనను బలపరుస్తోంది. 

కాగా.. జాతీయవాద ఉద్యమకారుడు ఫణీంద్ర.. నేపాల్ చాలా కాలంగా గ్రేటర్ నేపాల్ తరఫున ప్రచారం చేస్తున్నారు. 'గ్రేటర్ నేపాల్' మ్యాప్ ను కూడా అధికారికంగా ప్రచురించాలని పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గగన్ థాపా గురువారం అన్నారు. ‘ఏదైనా కౌంటీ సాంస్కృతిక పటాన్ని ప్రచురించి ముందుకు సాగితే, గ్రేటర్ నేపాల్ మ్యాప్ ను ప్రచురించే, దానిపై ఆలోచించే హక్కు కూడా నేపాల్ కు ఉంది. కొత్త మ్యాప్ ను ప్రచురించాలని నేపాల్ భావిస్తే భారత్ అభ్యంతరం చెప్పకూడదు. బదులుగా దాన్ని అంగీకరించాలి’ అని థాపా పేర్కొన్నారు.

ప్రత్యేక బడ్జెట్ ను నిలిపేసి రైల్వేలను బీజేపీ నాశనం చేసింది - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

‘అఖండ భారత్’ మ్యాప్ పై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ బుధవారం స్పందించారు. ఇది రాజకీయ సమస్య కాదని అన్నారు. అఖండ భారత్ మ్యాప్ అంశాన్ని ఇటీవల ముగిసిన తన భారత పర్యటనలో లేవనెత్తానని చెప్పారు. ‘‘పార్లమెంటులో ఉంచిన కొత్త భారత మ్యాప్ అంశాన్ని లేవనెత్తాం. అయితే దీనిపై భారత్ స్పందిస్తూ.. ఇది సాంస్కృతిక, చారిత్రాత్మక మ్యాప్ అని, రాజకీయ మ్యాప్ కాదని పేర్కొంది. దీన్ని రాజకీయ మార్గంగా చూడకూడదు. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంది. కానీ నేను దాన్ని లేవనెత్తాను’’ అని ఆయన అన్నారు.

గత కొన్నేళ్ల నుంచి నేపాల్ కూడా భారత భూభాగంలో ఉన్న కాలాపానీ, లిపు లేఖ్, లింపియురా ప్రాంతాలు తమవని వాదిస్తోంది. దీనిపై సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. దీనిపై భారత వాదనలకు ప్రతిస్పందనగా నేపాల్ ప్రభుత్వం 2020 లో ఆయా ప్రాంతాలను తమ భూభాగంలోవే అని పేర్కొంటూ కొత్త రాజకీయ మ్యాప్ ను విడుదల చేసింది. 

ముస్లిం దుకాణదారులు పట్టణం విడిచి వెళ్లాలి : ఉత్తర కాశీలో వెలసిన వివాదాస్పద పోస్టర్లు

ఒకప్పుడు నేపాల్ భూభాగం తూర్పున తీస్తా నది నుంచి పశ్చిమాన సట్లెజ్ వరకు విస్తరించింది. అయితే బ్రిటిష్ వారితో యుద్ధం తరువాత నేపాల్ తన భూభాగంలో ఎక్కువ భాగాన్ని కోల్పోయింది. యుద్ధానంతరం మేచి నుండి తీస్తా వరకు, మహాకాళి నుండి సట్లెజ్ వరకు భూభాగాలు శాశ్వతంగా భారతదేశంలో విలీనం అయ్యాయి. 1816 మార్చి 4 న, నేపాల్, ఈస్టిండియా కంపెనీ మధ్య సుగౌలి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం నేపాల్ భూభాగం మేచి-మహాకాళి వరకే పరిమితం అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios