Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 39 మంది దుర్మరణం

పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని లాస్ బెలాలో ఓ బస్సు లోయలో పడిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో 39 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

A terrible road accident in Pakistan's Balochistan.. 39 people died when the bus fell into the valley
Author
First Published Jan 29, 2023, 2:50 PM IST

పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని లాస్ బెలాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనకు అతివేగమే కారణమని ‘డాన్’ తన కథనంలో పేర్కొంది. 48 మంది ప్రయాణికులతో కూడిన బస్సు క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పాక్ మీడియా తెలిపింది.

బస్సు యూ టర్న్ తీసుకుంటుండగా అదుపుతప్పి లాస్బెలాలోని బ్రిడ్జి పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో బోగి లోయలో పడిపోయింది. ఆ తర్వాత వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గాయపడి 39 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భూమిలోంచి నీటిని తోడితే పన్ను , పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని, తీవ్రంగా ఛిద్రమైన అవశేషాల గుర్తింపును నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్షలను ఉపయోగిస్తామని ఓ అధికారి మీడియాకు తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. అస్తవ్యస్తమైన రహదారులు, అలసత్వంతో కూడిన భద్రతా చర్యలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని వార్తా సంస్థ ‘ఏఎఫ్ బీ’ తెలిపింది. 

పాకిస్థాన్ లో ప్యాసింజర్ బస్సులు తరచుగా సామర్థ్యానికి మంచి ప్రయాణికులతో కొనసాగుతుంటాయి. డ్రైవర్లు సాధారణంగా సీటు బెల్టులు ధరించరు. గతేడాది నవంబర్ లో దక్షిణ పాకిస్తాన్ లో మినీ బస్సు లోతైన నీటి గుంతలో పడిపోయింది. దీంతో 20 మంది చనిపోయారు. ఇందులో 11 మంది పిల్లలు ఉన్నారు. గత ఆగస్టులో ముల్తాన్ నగర శివార్లలో ఒక బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొనడంతో 20 మంది మరణించారు. కాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2018లో పాకిస్తాన్ రోడ్ల జరిగిన ప్రమాదాల్లో 27,000 మందికి పైగా మరణించారు.

శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్.. ఈరోజు ముగియనున్న భారత్ జోడో యాత్ర..

ఇలాంటి ప్రమాదమే ఉత్తర పెరూలో శనివారం తెల్లవారుజామున జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 24 మంది మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు, లిమా నుండి బయలుదేరి, ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళ్తోంది. అది ఆర్గానోస్ పట్టణానికి సమీపంలో రోడ్డుపైకి చేరుకుంది.

సేవ్ లడఖ్‌లో పేరుతో వాంగ్‌చుక్ దీక్ష.. హౌస్‌ అరెస్ట్‌ చేసినట్టుగా పోస్టు..

ఈ క్రమంలో డెవిల్స్ కర్వ్ అని పిలిచే ప్రదేశంలో అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగితా వారికి గాయాలు అయ్యాయి. బస్సు కొండపై నుంచి కిందపడిన సమయంలో పలువురు బస్సులోనే చిక్కుకున్నారు. మరి కొందరు కింద పడిపోయారు. క్షతగాత్రులను ఎల్ ఆల్టో, మాన్‌కోరాలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ బస్సు ప్రమాదం పెరూకు ఉత్తరాన ఉన్న ఎల్ ఆల్టో జిల్లాలో సంభవించిందని ‘సుత్రాన్’ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios