Asianet News TeluguAsianet News Telugu

మీ ఫోన్ మోడల్ ఏంటని పాకిస్థానీ డాక్టర్ కు నెటిజన్ ప్రశ్న... ఆమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్

పాకిస్థాన్ విద్యుత్ సంక్షోభంపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కరెంటు కోతలు, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై మీమ్స్ వేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంలోనే మరో పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

A netizen asked a Pakistani doctor what is your phone model... Her answer went viral on social media
Author
First Published Jan 26, 2023, 9:04 AM IST

ప్రస్తుతం సోషల్ మీడియాను అనేక మంది ఎంటర్టైన్ మెంట్ కోసమే వాడుతున్నారు. ఇందులో ప్రతీ రోజు వీడియోలు, ఫొటోలు, పోస్ట్ లు వైరల్ అవుతాయి. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటే ట్విట్టర్ లో వైరల్ గా మారింది. పాకిస్థాన్ విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఈ పోస్ట్ లో ఉన్న జోక్ తెగ వైరల్ అవుతోంది. పాకిస్థానీ మహిళ, ట్విట్టర్ యూజర్ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.

స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి.. ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

కొన్ని రోజులుగా పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై అనేక మీమ్స్ కూడా వస్తున్నాయి. కరెంటు కోతలను దృష్టిలో ఉంచుకొని ఓ పాకిస్థానీ మహిళ తన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ గొప్పధనాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. 

సైమా ఖాన్ అనే ట్విట్టర్ యూజర్ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పెర్ఫామెన్స్ ను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో చేసిన పోస్టు వల్ల ఇదంతా ప్రారంభమైంది. పాకిస్థాన్ లో ఎన్నో గంటలు కరెంటు లేకపోయినా.. తన ఫోన్ లో ఇంకా ఛార్జింగ్ ఏ మాత్రం తగ్గడం లేదని, తన ఫోన్ బ్యాటరీ తీరు అద్భుతంగా ఉందని ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

అంత మంచి బ్యాటరీ ఉన్న ఫోన్ ఏంటని ఓ యూజర్ తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని కామెంట్ రూపంలో ప్రశ్నించారు. సైమా చేసిన పోస్టు కింద ‘‘ మోడల్ ?’’ అంటూ కామెంట్ చేశారు. దీనికి ఆమె ఫన్నీగా స్పందించారు. తాను మోడల్ కాదని, డాక్టర్ ను అంటూ సమాధానం ఇచ్చారు.  కానీ దీనిని ట్విటర్ యూజర్లు తప్పుబట్టారు.

'చైనా సరిహద్దులో 26 పెట్రోలింగ్ పాయింట్లను కోల్పోయాం'

ఆమె కామెంట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ సెటైరికల్ గా పోస్టులు చేశారు. అయితే దీంతో ఆమె మళ్లీ రియాక్ట్ అయ్యారు. తాను ఫన్నీగా సమాధానం ఇచ్చానని, అది ఒక జోక్ అని, కానీ యూజర్లు దానిని తప్పుగా భావించారని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు. కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకోవాలని యూజర్లకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. అయితే ఈ పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios