Asianet News TeluguAsianet News Telugu

'చైనా సరిహద్దులో 26 పెట్రోలింగ్ పాయింట్లను కోల్పోయాం'

తూర్పు లడఖ్‌లోని 65 పెట్రోలింగ్ పాయింట్లలో భారత్ 26 పాయింట్లలో ఉనికి కోల్పోయింది. ఈ విషయాన్ని ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి నివేదికలో తెలిపారు. చైనాతో 3500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో చాలా చోట్ల కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య ఇది ​​వెల్లడైంది.

India Has Lost Presence In 26 Of 65 Patrol Points In Eastern Ladakh: Report
Author
First Published Jan 26, 2023, 1:01 AM IST

భారత్-చైనా సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితి నెలకొంటూనే ఉంటాయి. భారత భూభాగాన్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించుకునేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సంచలన నివేదిక అందింది. అందులో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. స్వయంగా మన దేశానికి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. 

26 చోట్ల భారత సాయుధ బలగాల పెట్రోలింగ్ పాయింట్‌లలో  నిర్వహణ లేకపోవడాన్ని సాకుగా చూపించి.. ఆ భూభాగాలను డ్రాగన్ కంట్రీ తన దేశంలో కలిపేసుకుంటోందని లేహ్‌ ఎస్పీ పీడీ నిత్య ఆ నివేదికలో వెల్లడించారు.రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని చోట్ల బఫర్‌ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని.. అయితే వాటిని ఆసరాగా చేసుకొని సరిహద్దునను వెనక్కి నొడుతూ భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

లడఖ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి పిడి నిత్య తన నివేదికలో ఇలా పేర్కొన్నారు. ప్రస్తుతం కారాకోరం పాస్ నుండి చుమూర్ వరకు 65 పెట్రోల్ పాయింట్లు ఉన్నాయి, వీటిని క్రమం తప్పకుండా ఐఎస్‌ఎఫ్ (ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్) పెట్రోలింగ్ చేయాల్సి ఉంది. అయితే.. భారత భద్రతా బలగాలు ఎటువంటి పెట్రోలింగ్ చేయని కారణంగా.. 65 పెట్రోల్ పాయింట్లలో..26  పాయింట్లలో భారత్ తన ఉనికి కోల్పోయిందని, 26 చోట్ల(5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయని లేహ్‌ ఎస్పీ పీడీ నిత్య వెల్లడించారు. గత వారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో ఆమె ఈ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌ కూడా పాల్గొన్నారు.


ఆ నివేదికలో భారత బలగాల కదలికల్ని గుర్తించేందుకు అక్కడి ఎత్తైనా శిఖరాలపై కెమెరాలను సైతం అమర్చినట్టు సంచలన విషయాలను వెల్లడించారు. అందుకే  బఫర్‌ జోన్‌లోకి భారత సైన్యం ప్రవేశించిన వెంటనే.. చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు తమ భూభాగంలో ఉన్నట్టు  చైనా వాదిస్తోందని, కొద్దిరోజుల నుంచి చైనా ఈ ప్రాంతాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదినలో స్పష్టం చేశారు. 2020లో ఘోరమైన ఘర్షణ జరిగిన గాల్వాన్ లోయలో కూడా ఈ చైనా వ్యూహం కనిపించిందని ఆయన అన్నారు. ఆ సమయంలో 20 మంది భారతీయ సైనికులు ,కనీసం నలుగురు చైనా సైనికులు   యుద్ధంలో మరణించారు. పరిమితి లేని ప్రాంతాలను గుర్తించడం , వాటిని ఖాళీగా ఉంచడం కూడా సైన్యం యొక్క నైతికతను ప్రభావితం చేస్తుందని నిత్య అన్నారు. కాగా.. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్‌ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.

అయితే.. తూర్పు లడఖ్‌లో భారత్ తన భూమిలో కొంత భాగాన్ని కోల్పోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ ఎలాంటి భూమిని కోల్పోలేదని సైన్యం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో రెండు వైపులా పెట్రోలింగ్ ఖచ్చితంగా నిలిపివేయబడింది. కానీ అటువంటి ప్రాంతాల్లో మన సాంకేతిక ఉనికిలో ఉంటుందని కేంద్రం పేర్కొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios