Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌ బాల్ఖ్ ప్రావిన్స్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ పేలుడు సంభవించింది. హైరాతన్ ఆయిల్ ఉద్యోగులకు చెందిన బస్సులో బల్ఖ్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. 

A huge explosion in Afghanistan's Balkh province.. Five people died
Author
First Published Dec 6, 2022, 1:22 PM IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని బాల్క్ ప్రావిన్స్‌లో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. చమురు కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనంపై పేలుడు సంభవించడంతో దాదాపు ఐదుగురు  ఐదుగురు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు.

వివాదాస్పదంగా మారిన ‘చేపల కూర’ వ్యాఖ్యలు.. బాలీవుడ్ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు..

ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హైరాతన్ ఆయిల్ ఉద్యోగులకు చెందిన బస్సులో బల్ఖ్‌లో పేలుడు సంభవించిందని ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి మహ్మద్ ఆసిఫ్ వజేరి తెలిపారు. పేలుడులో కనీసం నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయని అన్నారు. 

ఘోరం.. పక్షవాతంతో బాధపడుతున్న భార్య పరిస్థితి చూడలేక దారుణంగా హతమార్చిన భర్త.. ఎక్కడంటే ?

అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవలి నెలల్లో పట్టణ కేంద్రాలలో అనేక దాడులు జరిగాయి. వాటిలో కొన్నింటికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించాయి. 

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...

Follow Us:
Download App:
  • android
  • ios