హమాస్ కు భారీ ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మహమ్మద్ కాటమాష్ హతం.. ఆయన ఎవరంటే ?
ఇజ్రాయిల్, హమాస్ దళాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు వైపులా తీవ్ర నష్టం జరుగుతోంది. అయితే ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నాయకుడు ఒకరు మరణించారు. ఆయన ఇజ్రాయిల్ పై ఫైర్ ప్లాన్ రూపొందించి, అమలు చేశారు.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గాజాలో హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాంతీయ ఆర్టిలరీ విభాగం డిప్యూటీ హెడ్ మహమ్మద్ కాటమాష్ ను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆదివారం హతమార్చాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ప్రకటించాయి. దీంతో హమాస్ కు తీరని నష్టం వాటిల్లింది.
జమ్మూ కాశ్మీర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రత నమోదు..
మహమ్మద్ కాటమాష్ ఉగ్రవాద సంస్థ సెంట్రల్ క్యాంప్స్ బ్రిగేడ్ లో అగ్నిమాపక, ఫిరంగి నిర్వహణకు కాటమాష్ బాధ్యత వహించారు. గాజా స్ట్రిప్ లో అన్ని రౌండ్ల పోరాటాలలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఫైర్ ప్లాన్ లను రూపొందించడంలో, అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఇజ్రాయెల్ రాకెట్ ఫైరింగ్ స్క్వాడ్ అధిపతి, స్ట్రిప్ ఉత్తర భాగంలోని గాజా సరిహద్దు కంచె వద్దకు చేరుకున్న హమాస్ కార్యకర్త టార్గెట్ గా దాడి చేసింది. అంతేకాకుండా ఆయుధాల తయారీ కేంద్రం, సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. ఇదిలావుండగా... గాజా-ప్రాంత కమ్యూనిటీలపై అక్టోబర్ 7వ తేదీన దాడులు మొదలయ్యాయి. ఇది జరిగిన రెండు వారాల తరువాత ఇజ్రాయెల్ భద్రతా దళాలు శనివారం హమాస్ కమాండోను పట్టుకున్నట్లు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ (షిన్ బెట్) ఆదివారం ప్రకటించింది.
దారుణం.. ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదని మహిళా పోలీసును హతమార్చిన భర్త..
ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడులకు పాల్పడింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగడంతో యుద్దం మొదలైంది. ఈ దాడి, ప్రతి దాడుల వల్ల ఇరు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. గాజాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారింది. హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. బాంబు దాడుల్లో 4,300 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయిల్ లో కూడా వేల సంఖ్యలో పౌరులు, సైనికులు మరణించారు.
కాగా.. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయం అందించేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. పాలస్తీనియన్ల కోసం 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రి, 6.5 టన్నుల వైద్య సహాయ సామాగ్రిని తీసుకుని ఐఏఎఫ్ సీ-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ సామాగ్రి ఈజిప్టు మీదుగా గాజాకు చేరుకోనుంది. గాజాకు సాయం పంపించినవాటిలో లైఫ్ సేవింగ్ మెడిసిన్, సర్జికల్ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ యుటిలిటీలు, నీటి శుద్ధి మాత్రలు, ఇతర అవసరమైన వస్తువులు ఉన్నాయి.