Asianet News TeluguAsianet News Telugu

ఔను.. వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు.. 78 ఏళ్ల వృద్ధుడికి 18 ఏళ్ల యువ‌తికి మ‌ధ్య ప్రేమ‌.. అంద‌రిని ఒప్పించి పెళ్లి

78 ఏళ్ల వృద్ధుడు, 18 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని నిర్ణయింకున్నారు. మూడేళ్ల పాటు ప్రేమ ప్రయాణం సాగించిన ఆ జంట, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

A 78-year-old man married an 18-year-old girl in the Philippines. The couple got married after persuading the elders.
Author
First Published Oct 5, 2022, 10:22 AM IST

ప్రేమ మ‌నిషిని చూసి కాదు.. మ‌న‌స్సును చూసి క‌లుగుతుంది. ప్రేమ‌కు కులం, మ‌తం, ప్రాంతం, రంగు, రూపం, వ‌య‌స్సుతో సంబంధం లేదు. ప్రేమ ఎప్పుడు, ఎవ‌రి మీద క‌లుగుతుందో చెప్ప‌లేం. ఇవ‌న్నీ సినిమాల్లో త‌ర‌చుగా వినిపించే డైలాగ్ లు. నిత్య జీవితంలో కూడా సంద‌ర్భాల్లో వింటుంటాం. కానీ ఓ జంట నిజంగానే ప్రేమ‌కు వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని నిరూపించి వార్త‌ల్లో నిలిచింది.

గ‌ర్భా ఆడుతుండ‌గా రాళ్ల‌తో దాడి.. ఆక‌తాయిల‌ను పోల్ కు క‌ట్టేసి కొట్టిన పోలీసులు.. వైర‌ల్ అవుతున్న వీడియో

78 ఏళ్ల వృద్దుడు, 18 ఏళ్ల యువ‌తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ యువ‌తికి 15 ఏళ్ల వ‌య‌స్సు ఉండ‌గానే వారిద్ద‌రూ ఈ ప్రేమ ప్ర‌యాణం ప్రారంభించారు. ఆమెకు మైనారిటీ తీరిపోగానే వారిద్ద‌రూ త‌మ సంప్రాదాయం ప్రకారం విహాహం చేసుకున్నారు. పెద్ద‌లు, ఇరు కుటుంబ స‌భ్యులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ పెళ్లి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. 

పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదం.. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మందిని రక్షించిన సిబ్బంది

అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న ఈ వింత పెళ్లి ఫిలిప్పీన్స్‌లో జ‌రిగింది. ర‌ష‌ద్ మంగాకోప్ అనే 78 ఏళ్ల రైతు 18 ఏళ్ల హలీమా అబ్దుల్లాను మొద‌టి సారిగా కగాయన్ ప్రావిన్స్ లో ఓ విందు సంద‌ర్భంగా మొద‌టి సారిగా క‌లుసుకున్నారు. దీంతో అప్పుడే వారి మ‌ధ్య పరిచ‌యం ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. వారి మ‌ధ్య ప్రేమ పుట్టిన‌ప్పుడు ఆ యువ‌తికి 15 సంవ‌త్స‌రాలు, అత‌డికి 75 ఏళ్ల వ‌య‌స్సు. అప్ప‌టి నుంచి వారిద్దరూ జంటగా మూడేళ్లు సంతోషంగా గడిపారు.

దీని త‌రువాత ఈ ఏడాది ఆగస్టు 25 న ఇస్లామిక్ సంప్రదాయం ప్ర‌కారం ఘ‌నంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇరు కుటుంబ స‌భ్యులు అభ్యంత‌రం తెలుప‌లేదు. అయితే వారిద్ద‌రికీ ఇది మొద‌టి ప్రేమ‌. ర‌షీద్ ఇంత వ‌ర‌కు ఎవ‌రినీ ప్రేమించ‌లేదు. అలాగే పెళ్లి కూడా చేసుకోలేదు. 

ముంబ‌యిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదురుగు స్పాట్ డెడ్.. 12 మందికి తీవ్ర‌ గాయాలు

ఈ పెళ్లిపై రాషెడ్ మేనల్లుడు బెన్ మంగాకోప్ మాట్లాడుతూ.. ఇది పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లి కాద‌ని, వారిద్ద‌రూ పూర్తి ఇష్టంతో పెళ్లి చేసుకున్నార‌ని చెప్పారు. త‌న త‌ల్లి సోద‌రుడు వ‌రుడు అయ్యాడ‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు. పెళ్లి కూతురి తండ్రి త‌న మామ‌య్య ద‌గ్గ‌ర ప‌ని చేశార‌ని, అలా వారిద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని చెప్పారు. త‌న మామ‌య్య వ‌స్సుల్లో పెద్ద‌వాడ‌ని, కానీ ఒంట‌రిగా బ్ర‌హ్మ‌చారిగా ఉంటున్నాడ‌ని తెలిపారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయ‌ని ఆయ‌న చెప్పారు. 

కాగా.. ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి త‌ల్లిదండ్రులు అంగీక‌రిస్తేనే ప్రేమ వివాహం చేసుకోవ‌చ్చు. పెద్ద‌ల నుంచి ఈ పెళ్లికి అభ్యంత‌రం లేదు కాబ‌ట్టి అంతా సాఫీగా సాగిపోయింది. అయితే ఈ కొత్త జంట కార్మెన్ టౌన్ లో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఈ పెళ్లిపై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాపై చ‌ర్చ జ‌రుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios