Omicron effect.. 5,700 విమానాల సర్వీసుల రద్దు
Omicron వేరియంట్ పంజా విసురుతుండటం లో ప్రపంచవ్యాపంగా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కొన్ని దేశాలు డొమెస్టిక్ సర్వీసులను మాత్రమే నడిపిస్తోన్నాయి. యూరప్ దేశాలలో ఈ వేరియంట్ ఎక్కువగా ఉండటంతో పలు క్రిస్మస్ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా 5700లకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చినా ఈ వేరియంట్ క్రమంగా పంజా విసురుతోంది. క్రిస్ట్మస్ పండుగ నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత ప్రభావం పడుతోందని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,700 విమానాలు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయి.
యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ..అంతర్జాతీయ రవాణా స్తంభించిపోయింది. ముందు జాగ్రత్తగా శుక్ర, శని వారాల్లో వేలాది సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. అమెరికా నుంచి యూరోప్ వరకు అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఆంక్షలను విధించడంతో ఆ ప్రభావం క్రిస్మస్ సంబరాలపై పడింది.
Read Also: ఏపీలో మరో సైబర్ మోసం: ప్రతి రోజూ డబ్బుల పేరుతో చీటింగ్, పోలీసులకు ఫిర్యాదు
Flightaware.com ప్రకారం, క్రిస్మస్ రోజున ప్రపంచవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి, 11,000 అలస్యంగా నడపబడ్డాయి. ఒక్క అమెరికాలోనే దాదాపు 8వందల 70 వరకు విమానాలను రద్దు చేశారు. దాదాపు 4,200 విమానాలు ఆలస్యంగా బయలు దేరాయి. షెడ్యూల్ చేయబడిన వాటిలో 10 శాతం విమానాలను రద్దయ్యాయి.
Read Also: Omicron Cases in AP: మహమ్మారి బారిన మరో ఇద్దరు...ఏపీలో ఆరుకు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఒక్క శుక్రవారం, దాదాపు 2,400 విమానాలు రద్దు కాగా.. 11,000 విమానాలు ఆలస్యంగా నడిశాయి. క్రిస్మస్ రోజు నాడే 2,000 విమాన సర్వీసులు రద్దయినట్లు Flightaware డాట్ కామ్ తెలిపింది. ప్రధానంగా సిబ్బంది కొరత ఏర్పడటం వల్ల లుఫ్తాన్స (Lufthansa) , యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines), జెట్‌బ్లూ (JetBlue)
డెల్టా( Delta) ఎయిర్‌లైన్స్ పలు డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది. మున్ముందు ఈ విమాన సర్వీసులు మరిన్ని రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని ఫ్లైట్అవేర్ అంచనా వేసింది. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Read Also: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే
కిస్మస్ వారంతంలో ఓమిక్రాన్ కేసులు పెరిగే అవకాశముందని United Airlines తెలిపింది. విమానాలు నడపడం వల్ల వ్యక్తులపై ఈ వేరియంట్ ప్రభావం ప్రత్యక్షంగా పడుతోందని, అందుకే.. తాము కొన్ని విమానాలను రద్దు చేయవల్సి వచ్చిందనీ , ఈ ప్రభావం ప్రయాణీకులపై పడుతోందని ముందుగానే తెలియజేస్తున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. అదేవిధంగా, డెల్టా ఎయిర్ లైన్స్ కూడా దాదాపు 280 విమానాలను రద్దు చేసింది , ఆదివారం నాడు కూడా 64 విమానాలను రద్దు చేసింది,
అమెరికాలో తాజాగా వెలుగుచూస్తున్న కోవిడ్ కేసుల్లో 70 శాతానికి పైగా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులే కావడంతో అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ మొదటి వేవ్ తరహాలో ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలపై బ్యాన్ విధించింది. దీంతో అమెరికాలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణించాలనుకున్న వాళ్లు.. అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వాళ్లు… అమెరికాకు ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్లు…ఆగిపోయారు.క్రిస్మస్ సందర్భంగా హాలిడేస్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్లకు ఒమిక్రాన్ శాపంగా మారింది.