ఏపీలో మరో సైబర్ మోసం: ప్రతి రోజూ డబ్బుల పేరుతో చీటింగ్, పోలీసులకు ఫిర్యాదు
వైద్య పరికరాలను కొనుగోలు చేస్తే ప్రతి రోజూ అద్దె రూపంలో డబ్బులు వస్తాయని నమ్మించి నిందితులు మోసానికి పాల్పడ్డారు. ఈ నెల 3 నుండి 23 వరకు నిందితులు డబ్బులు చెల్లించారు. తాము మోసపోయామని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య పరికరాల కొనుగోలు పేరుతో ఆన్ లైన్ మోసం వెలుగు చూసింది. ప్రతి రోజూ అద్దె చెల్లిస్తామని ఆశచూపి అమాయకుల నుండి కోట్లు కొల్లగొట్టారు నిందితులు. బాధితులు ఈ మేరకు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Vijayawadada లో ఆరుగురి నుండి రూ. 15 లక్షలను వసూలు చేసినట్టుగా Police కు ఫిర్యాదులు అందాయి., అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Love life app ను online లో డౌన్ లోడ్ చేసుకొని వైద్య పరికరాలను కొనుగోలు చేస్తే ప్రతి రోజూ అద్దె చెల్లించనున్నట్టుగా యాప్ నిర్వాహకులు నమ్మించారు. ఈ మాటలను నమ్మిన బాధితులు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వైద్య పరికరాలను కొనుగోలు చేశారు. రూ. 500 నుండి రూ. రూ. 3 లక్షల వరకు Health పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చని యాప్ నిర్వాహకులు నమ్మించారు. కొనుగోలు చేసిన వైద్య పరికరాలను తామే అద్దెకు తీసుకొంటామని నమ్మించారు. ఆయా వైద్య పరికరాల ధర ఆధారంగా ప్రతి రోజూ వాటికి అద్దెను చెల్లిస్తామని బాధితులను నమ్మించారు. అంతేకాదు ఈ యాప్ లో సభ్యులుగా చేర్పిస్తే రూ. 500 నుండి రూ. 2 వేల వరకు బహుమతులను చెల్లించారు. ఈ నెల 3 నుండి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ లో బాధితులకు డబ్బులు చెల్లించారు. అయితే ఈ నెల 23 నుండి money చెల్లించలేదు. అయితే ఈ విషయమై నిర్వాహకులను ప్రశ్నిస్తే సర్వర్ సమస్య అంటూ నమ్మించారు. రెండు రోజులుగా డబ్బులు చెల్లించలేదు. దీంతో బాధితులు తాము మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఎక్కువగా చోటు చేసకుంటున్నాయి. Cyber నేరాల విషయాలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా కూడా ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మి మోసపోతున్నారు. Corona సమయంలో దేశ వ్యాప్తంగా గతంలో కంటే ఎక్కువగా సైబర్ నేరాలు నమోదయ్యాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా తెలుగు రాస్ట్రాల్లో కూడా సైబర్ నేరాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలోనే సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలకు గురై పెద్ద ఎత్తున బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.