తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో వుంటాయని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో వుంటాయని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు విపత్తు నిర్వహణచట్టం కింద ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు.
కొద్దిపాటి నియంత్రణ చర్యలతోనే జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా విధించనున్నారు.
కాగా.. రెండురోజుల క్రితం న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది.కరోనాపై Telangana High Court గురువారం నాడు విచారణ నిర్వహించింది.ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. Maharashtra,delhi ప్రభుత్వాల మాదిరిగానే New year, christmas వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.
Also Read:క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
జనం గుంపులుగా ఉండకుండా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని కోరింది. ఎయిర్‌పోర్టు్లో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలని కూడా హైకోర్టు తెలంగాన ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలకు జనం వచ్చే సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
వేడుకలు నిర్వహణ సమయంలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారంతా మాస్క్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే భారీ జరిమానాను విధించాలని కూడా ఆదేశించింది.రెండు , మూడు రోజుల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని కూడా హైకోర్టు సూచించింది.