హాట్సాప్: కేరళ వరద బాధితులకు బంగారు కేక్‌ను అమ్మిన ప్రణతి

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 22, Aug 2018, 5:09 PM IST
12-year-old Dubai girl donates birthday gift of gold cake for Kerala flood relief
Highlights

వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకొనేందుకుగాను దుబాయ్‌కు చెందిన  12 ఏళ్ల బాలిక తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకొంది


తిరువనంతపురం: వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకొనేందుకుగాను దుబాయ్‌కు చెందిన  12 ఏళ్ల బాలిక తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా  తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చిన బంగారు కేక్‌ను విక్రయించగా వచ్చిన  డబ్బును  కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చింది.

కేరళలోని  కన్నూర్ కు చెందిన  వివేక్ కళ్లిదిల్ దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కుటుంబం అక్కడే నివాసం ఉంటుంది.  కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన కళ్లిదిల్ కూతురు ప్రణతి కేరళ వరద బాధితులకు  సాయం చేయాలని భావించింది.

 ఆగష్టు 21వ తేదీన ప్రణతి పుట్టిన రోజు.కూతురు పుట్టిన రోజును పురస్కరించుకొని కళ్లిదిల్  రూ. 19 లక్షల విలువైన బంగారు కేక్ ను తయారు చేయించాడు. కానీ, ప్రణతి ఆ కేక్ ను కట్ చేయలేదు. ఆ కేక్ ను ఆమె విక్రయించింది.

కేరళ వరద బాధితులకు సహాయం చేద్దామని  భావించి తన కూతురు కేక్ ను కట్ చేయకుండా దాన్ని విక్రయించిందని వివేక్ కళ్లిదిల్ చెప్పాడు. బంగారు కేక్ ను విక్రయించి  వచ్చిన డబ్బును కేరళ వరద బాధితులకు సహాయంగా ఇచ్చాడు.  ప్రణతి గతంలో కూడ  15 ఏళ్ల బాలిక సర్జరీకి అవసరమైన రూ. 3 లక్షలను  కూడ  అందించింది.

ఈ వార్తలు చదవండి

కేరళకు రిలయన్స్ భారీ విరాళం...ఉచిత జియో సేవలు

పంబా ఉధృతి: శబరిమలకు రావద్దని భక్తులకు సూచన

కేరళలో తగ్గుముఖం పట్టిన వరదలు: ఇళ్లలోకి చేరిన పాములు, మొసళ్లు

కూతురి పెళ్లికి దాచిన డబ్బును వరద బాధితులకు విరాళమిచ్చిన మేయర్

కేరళకు ఇండియన్ రైల్వే భారీ విరాళం

కేరళ రాష్ట్రానికి ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ రూ.25లక్షల విరాళం

కేరళ: రూ.1.5 లక్షలు ప్రకటించిన చేపలమ్ముకొనే విద్యార్థిని

 

loader