Asianet News TeluguAsianet News Telugu

ఇక అవన్నీ ఆపేస్తాను... పాక్ సింగర్ రబీ పిర్జాదా షాకింగ్ డెసిషన్

ఇటీవల ఆమెకు  ఊహించని షాక్‌ తగిలింది. ఆమె అశ్లీల ఫొటోలు, రెండు నగ్న వీడియోలు శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే ఆమెకు నెటిజన్లు ఈ విధంగా  షాకిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
 

"Quitting Showbiz," Tweets Pak Singer Who Threatened PM Modi
Author
Hyderabad, First Published Nov 5, 2019, 1:34 PM IST

ప్రధాని మోదీని హతమారుస్తానంటూ తరుచూ కామెంట్స్ చేసి సంచలనంగా మారిన  పాక్‌  సింగర్ రబి ఫిర్జాదా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను ఇక నుంచి ఎలాంటి షోలు చేయదలుచుకోలేదని ఆమె పేర్కొన్నారు. 

ఇటీవల ఆమెకు  ఊహించని షాక్‌ తగిలింది. ఆమె అశ్లీల ఫొటోలు, రెండు నగ్న వీడియోలు శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే ఆమెకు నెటిజన్లు ఈ విధంగా  షాకిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

‘రబీ పిర్జాదా అనే నేను.. ఇక నుంచి షోబిజ్ నుంచి తప్పుకుంటున్నాను. ఇక మీదట ఎలాంటి షోలు  చేయను. నేను చేసిన తప్పులను అల్లా క్షమిస్తాడని కోరుకుంటున్నాను. ప్రజలు నన్నే ప్రేమించేలా చేస్తారని ఆ అల్లాని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

AlsoRead ప్రధాని మోదీకి బెదిరింపులు... పాక్ సింగర్ అశ్లీల వీడియోలు లీక్.....

ఇటీవల ఆమె న్యూడ్ వీడియోలు విడుదలైన సమయంలో ఆ  ఘటనపై ట్విట్టర్‌ సంస్థ వెంటనే స్పందించింది. రబి  అశ్లీల ఫొటోలు, వీడియోలను ఎవరూ షేర్‌ చేయవద్దని కోరింది. ఈ లీకేజీ వ్యవహారంలో పాకిస్థాన్‌ సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబి ఇటీవల గఫూర్‌తో వాగ్వాదానికి దిగిందని, ఈ లీకేజీకి అదే కారణమై ఉంటుందని ట్విట్టర్‌లో సందేహాలు, సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

మరికొందరు మాత్రం ఆధారాల్లేకుండా ఉన్నతస్థానంలోని అధికారిని అవమానించడం తగదని సూచిస్తున్నారు. ఇంకొందరు ఈ లీకేజీ వెనుక రబి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు ఆమెకు తగిన శాస్త్రి జరిగిందంటూ సందేశాలు పంపుతున్నారు. రబి తరుచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం ఆమె పాములతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసి, మోదీకి బహూకరిస్తానని బెదిరించింది. ఇటీవలే బాంబులతో ఉన్న జాకెట్‌ను వేసుకొని మోదీని పేల్చేస్తానంటూ ప్రగల్భాలు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios