జార్ఖండ్ లో దుండగులు రెచ్చిపోయారు. హైదరాబాద్ కు చెందిన శరత్‌బాబును కాల్చి చంపారు.

జార్ఖండ్ లో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు.హైదరాబాద్ కు చెందిన వీ.శరత్ బాబు అనే వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. హైదరాబాద్ లోని కొత్తపేట విజయపురి కాలనీలో ని సన్ షైన్ అపార్ట్మెంట్ లో నివసించే వీ.శరత్ బాబు (55) ఏపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీలో కాంట్రాక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

అయితే..ఓ కాంట్రాక్టు విషయమై 4 రోజుల క్రితం ఝార్ఖండ్ వెళ్ళారు. కాగా మంగళవారం(మే 9 ) నాడు సైట్ విజిటింగ్ పై బయటకు వెళ్తుండగా అతన్ని దుండగులు కాల్చి చంపారని సమాచారం. శరత్ బాబుకు భార్య ఒక కొడుకు ఉన్నారు. శరత్ బాబు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

అయితే, శరత్ బాబును నక్సలైట్లు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో వాస్తవం లేదని స్పష్టమైంది. దుండుగులు ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.