యువతిని బలి తీసుకున్న హైదరాబాద్ రోడ్లు.. వీడియో వైరల్
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో.. జరిగే సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఓ యువతి స్నేహితుడితో కలిసి ఎగ్జామ్ కోసం వెళ్తుండగా ప్రమాదం కబళించింది. యాక్సిడెంట్‌లో యువతికి చనిపోగా. ఆమె స్నేహితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో.. జరిగే సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఓ యువతి స్నేహితుడితో కలిసి ఎగ్జామ్ కోసం వెళ్తుండగా ప్రమాదం కబళించింది. యాక్సిడెంట్‌లో యువతికి చనిపోగా. ఆమె స్నేహితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్ నడిబొడ్డు చాదర్‌ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఫుటేజీలో యువతి తల టైర్ కింద నలిగిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేటకు చెందిన కావ్య అనే విద్యార్థిని.. తన స్నేహితుడితో కలిసి ఆర్ఆర్‌బీ పరీక్ష రాసేందుకు బయల్దేరారు.
Also Read:Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి
చాదర్‌ఘాట్ వద్దకు బానే వచ్చారు. అయితే అతుకులు, గతుకుల రోడ్డు కావడంతో కాస్త మెల్లిగానే వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ చోట గతుకు ఉండటంతో టూవీలర్ స్లో చేశాడు. అయితే బండి స్కిడ్డవడంతో ఇద్దరు వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయారు.
లేద్దామనుకునేలోపే అటుగా వస్తోన్న బస్సు యువతి తలపైనుంచి వెళ్లింది. దీంతో కావ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. బస్సు టైర్‌కు కాసింత దూరంలో ఉన్న యువకుడు కూడా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతనిని సమీప ఆస్పత్రికి తరలించారు.
Also Read:ప్రైవేటు బస్సు ఢీకొని మహిళ మృతి
కావ్య మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. రోడ్డు సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తమ బిడ్డును బలి తీసుకుందని మండిపడుతున్నారు.
తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కావ్య పేరెంట్స్ వాదన ఇలా ఉంటే.. అక్కడ రహదారి సరిగానే ఉందని మున్సిపల్ అధికారులు సెలవిస్తున్నారు. వారి వాహనం స్కిడ్ కావడం వల్లే వారు ప్రమాదానికి గురయ్యారే తప్ప.. అందులో తమ తప్పేమి లేదని తేల్చిచెప్పారు.
గురువారం హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
తమ సహచరుడి మరణవార్తపై సమాచారం అందుకున్న మిగతా ఆర్టీసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మృతులు పెద్ద అంబర్ పేట్ కోహెడకు చెందిన బొక్క రమణారెడ్డి, విజయమ్మగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు పశ్చిమగోదావరి జిల్లా తుని డిపోకి చెందినదిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.