హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ దారుణవ హత్యపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దిశ హత్య కేసులో దోషులకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సోమవారం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా షాద్ నగర్‌లో చంద్రబాబు కాస్సేపు ఆగారు. స్థానికంగా జరిగిన దిశ అత్యాచారం, హత్యతో తదనంతరం జరిగిన పరిణాలను పార్టీ కార్యకర్తలతో ఆయనకు వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షపడితేనే మిగిలిన వారు భయపడారని అన్నారు. అప్పుడే ఇలాంటి ఘటనలు  మరోసారి జరక్కుండా వుంటాయన్నారు. నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని చంద్రబాబుసూచించారు.

JusticeForDisha: తెలంగాణ వెటర్నరీ డాక్టర్ ఘటనపై చంద్రబాబు స్పందన ఇదీ..

భవిష్యత్‌లో ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేవలం పోలీసులపైనే కాదు ప్రజలందరిపైనా ఉందన్నారు. దిశ హత్యపై మరోసారి సంతాపం ప్రకటించిన  చంద్రబాబు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

దిశ దారుణ హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఇదివరకే స్పందిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని... అలాంటి వారికి సమాజంలో ఉండే హక్కు కూడా లేదని చెప్పారు. స్త్రీ, పురుషులను సమానంగా గౌరవించే విధంగా సమాజంలో మార్పురావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. 

కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆవేధన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులో శంషాబాద్ ప్రాంతంలో కామాంధుల కాటుకు బలయిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు టిడిపి తరపున సంతాపం, సానుభూతి తెలియచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 

video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా  వివిధ ప్రాంతాలలో అనేక మంది యువతులు, చిన్నారులు అత్యాచారాలకు గురైనా ఈ దారుణాలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇటువంటి దారుణాలపై సీఎం జగన్ ‌స్పందించి చర్యలకు‌ ఆదేశించాలని కోరారు.

ఏపిలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులలో ఎక్కువ శాతం వైసిపికి అనుకూలంగా ఉన్నవారే ముద్దాయిలుగా వుంటున్నారని ఆరోపించారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్నా బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదని... కనీసం ఈ దారుణాలపై కూడా వెంటనే స్పందించడం లేదని అన్నారు.

గతంలో ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే బాధిత చిన్నారికి సాయం అందించాలని టిడిపి భావించిందని...కానీ దీనివల్ల తమకు ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న భావనతో ప్రభుత్వం ఆ అమ్మాయిని ఆస్పత్రి నుంచి బలవంతంగా మార్చారని గుర్తుచేశారు. 

అభం శుభం తెలియని వయసులో అత్యాచారం జరిగాక బాలిక మానసికంగా  కృంగిపోయిందని... ఎవరిని చూసినా భయపడిపోయిందన్నారు.  ఇదే ఆసుపత్రిలో పుట్టిన అమ్మాయిని ఇప్పుడు ఇలా చూడటం బాధగా వుందని వైద్యం చేసిన డాక్టర్లు సైతం కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు.  

గుంటూరు జిల్లాకు చెందిన వైసిపి నేత కాసు మహేంద్ర రెడ్డి అనుచరులు నరేంద్ర రెడ్డి ఈ ఘటనలో నిందితుడని ఆరోపించారు. ఇప్పటివరకు వాళ్లపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదని అనురాధ అన్నారు.